మాస్ కమర్షియల్ సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్!

Update: 2022-08-11 03:45 GMT
విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంట‌గా నటించిన 'లైగర్' ఆగస్టు 25 న థియేటర్లలోకి రానుంది. విడుదలకు ముందు నిర్మాత‌ కరణ్ జోహార్ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ.. హృద‌యాల‌ను ట‌చ్ చేసే ఒక సుదీర్ఘ‌ నోట్ రాశారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాల స్నిప్పెట్ లతో కూడిన వీడియో ఫుటేజ్ ను కరణ్ జోహార్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. పూరి జగన్నాధ్ మాస్ కమర్షియల్ సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని వీడియోలో ఆకాశానికెత్తేశారు.

కరణ్ జోహార్ రాసిన నోట్ లో ''పూరీ జగన్నాథ్‌ వినోద‌రంగంలో నేటి మాస్-టెర్మైండ్. అలాంటి విలక్షణమైన దృష్టిగల ద‌ర్శ‌కుడు వేరొక‌రు లేరు. లార్జ‌ర్ దేన్ లైఫ్ కంటే పెద్ద కథాంశాలను అతను చాలా అప్రయత్నంగా ఎలా అల్లుకున్నాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ లో 'లైగర్' ని భారతదేశం మొత్తానికి అనేక భాషల్లో తీసుకురావడం మాకు గర్వకారణం. పూరి సర్- ఛార్మీ నేతృత్వంలోని అతని బృందంతో క‌లిసి ఈ ప్ర‌య‌త్నానికి పూర్తి బలం చేకూర్చడం నాకు గర్వకారణం'' అని అన్నారు.

ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్ టైనర్ ని మీ అందరికి అందించడానికి ఇంకా 15 రోజులు మాత్రమే సమయం ఉంది.పెద్ద స్క్రీన్ పై అద్భుత‌ మ్యాజిక్ ని గొప్ప వినోదాన్ని  చూడవచ్చు అని క‌ర‌ణ్ తెలిపారు.

లైగర్ అనేది పాన్-ఇండియా కేట‌గిరీలో విడుద‌ల‌వుతున్న భారీ ప్రాజెక్ట్. ఇది హిందీ- తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ భాషలలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - పూరి జగన్నాధ్ పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ట్రైల‌ర్ అన్నివ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మేకర్స్ ఫన్ ట్రాక్ ఆఫత్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ స్వచ్ఛమైన ప్రేమ పిచ్చి ఆప్యాయతల గురించి అద్భుతంగా సాగింది. ఈ సీజన్ కొత్త వైబ్ ఆఫత్ లాగా కనిపిస్తుందని ధ‌ర్మ సంస్థ ప్ర‌శంసాపూర్వ‌క నోట్ ని రాసింది.

విజయ్ దేవరకొండ- అనన్య పాండే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల ఈ జంట పంజాబీ తాలిని ఆస్వాధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. క‌ర‌ణ్ - పూరి-ఛార్మి బృందం వీలున్న అన్ని వేదిక‌ల‌పైనా లైగ‌ర్ కి ప్ర‌చారం చేస్తున్నారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ బాలీవుడ్ అరంగేట్రం గ‌నుక అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Full View

Tags:    

Similar News