మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో RT66 (వర్కింగ్ టైటిల్) సెట్స్ పైకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా లాంచింగ్ డేట్ ని చిత్రయూనిట్ ప్రకటించింది. 14 నవంబర్ ముహూర్తం అంటూ అదిరిపోయే ప్రీలుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
పోస్టర్ చూడగానే.. తుపాకి పట్టుకుని బయల్దేరిన వాస్కోడిగామాలా సీరియస్ గానే ఉన్నాడు మాస్ రాజా. మరి ఇలా తుపాకితో ఏ వేటకు వెళుతున్నాడో కానీ ఫ్యాన్స్ లో గుబులు మొదలైంది. ఈ సీరియస్ కాప్ క్రిమినల్స్ తాట తీస్తాడో లేక అరాచకుల వెనక ఉన్న పొలిటికల్ గూండాల తోలు వలుస్తాడో కానీ అతడిని చూస్తుంటే కోపంలో ఉన్న కాప్ లానే కనిపిస్తున్నాడు. కోపంలోనూ ఆలోచించేవాడిగా కనిపిస్తున్నాడు. ఆ ఒక్క షాడో ఫోటోలో అంత సైన్స్ మిక్స్ చేశారు గోపిచంద్ మలినేని.
అయితే ఇది రీమేక్ సినిమానా? దర్శకుడి సొంత స్క్రిప్టునా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇది అట్లీ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ `తేరీ`కి రీమేక్ అంటూ ఇటీవల ప్రచారం ఉంది. మరో కోణంలో చూస్తుంటే.. జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడు తరహా చిత్రమా? దానికి సీక్వెల్ కథనే మలినేని గోపిచంద్ రాసాడా? అన్న చర్చా మొదలైంది. లేదూ గబ్బర్ సింగ్ కి ప్రీక్వెల్ తరహా స్క్రిప్ట్ ఏదైనా ఎంచుకున్నారా? అసలు మాస్ మహారాజా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కాప్ స్టోరీని ఎలా డిజైన్ చేశారు? అంటూ వాడి వేడిగా చర్చ మొదలైంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాంచింగ్ డే అసలైన వివరాలు తెలుస్తాయేమో చూడాలి.