ఫస్ట్‌ గ్లిమ్స్ : మాస్ రాజా సమర్పిస్తున్న మట్టి కుస్తీ

Update: 2022-07-18 06:31 GMT
మాస్ మహారాజా రవితేజ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెల్సిందే. తాజాగా తన రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించిన విషయం తెల్సిందే. రవితేజ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమా లు ఉన్నాయి. అయినా కూడా మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో గెస్ట్‌ గా నటిస్తున్నాడు.

ఇటీవలే చిరు తో కలిసి షూటింగ్‌ లో జాయిన్ అయ్యాడు. మెగా స్టార్‌ చిరంజీవి తో నటించడం మాత్రమే కాకుండా వేరే హీరో సినిమా ను సమర్పించేందుకు కూడా సిద్ధం అయ్యాడు.

విష్ణు విశాల్‌ హీరోగా తమిళంలో రూపొందిన మట్టి కుస్తీ సినిమా ని తెలుగు లో రవితేజ సమర్పిస్తున్నాడు. విష్ణు విశాల్ పుట్టిన రోజు సందర్బంగా మట్టి కుస్తీ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది.

ఫస్ట్‌ గ్లిమ్స్ లో విష్ణు విశాల్ యొక్క లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు లో ఈయన ఇప్పటి వరకు హీరోగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకుల్లో నోటెడ్ అయ్యేలా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. రవితేజ కు విష్ణు విశాల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఈ సినిమా సమర్పణకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

విష్ణు విశాల్ మరియు రవితేజ లు కలిసి ఒకే సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి విష్ణు విశాల్ ను తెలుగు లో ప్రమోట్ చేయడం కు రవితేజ చేయబోతున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.

మట్టి కుస్తీ తమిళ్ లో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. తెలుగు లో కూడా అదే రేంజ్ లో రవితేజ వల్ల విడుదల సాధ్యం అయ్యేనా చూడాలి. ఈ సినిమాకు చెల్ల అయ్యావు దర్శకత్వం వహిస్తుండగా... జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Full View

Tags:    

Similar News