'మీనాక్షి సుందరేశ్వర్' టీజర్: పెళ్ళైన కొత్తలోనే ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వస్తే..!

Update: 2021-10-12 10:01 GMT
'దంగల్' ఫేమ్ సన్యా మల్హోత్రా - అభిమన్యు దాసాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా హిందీ చిత్రం ''మీనాక్షి సుందరేశ్వర్''. వివేక్ సోని ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు చెందిన ధర్మటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబడింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్ ఇండియాలో దీపావళి కానుకగా నవంబర్ 5న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'మీనాక్షి సుందరేశ్వర్' ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇది తమిళనాడులోని మధురై బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. భిన్న మనస్కులైన హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వస్తే.. ఆ కొత్త జంట ఎలాంటి కష్టనష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది 'మీనాక్షి సుందరేశ్వర్' సినిమాలో చూపించబోతున్నారు. 'నువ్వు నెర్వస్ గా ఉన్నావని తెలుసు.. నాకు నెర్వస్ గా ఉన్నవాళ్ళని మరింత నెర్వస్ గా చేయడం నాకు ఇష్టం' అని సన్యా చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ఇంజనీర్స్ బెస్ట్ హస్బెండ్ గా ఉండగలరని అభిమన్యు వివరించే విధానం అలరిస్తుంది.

ఉమ్మడి కుటుంబాలు - సంబంధాలు - పెళ్ళైన కొత్తలో నూతన వధూవరుల మధ్య వచ్చే ఇబ్బందులు - ప్రేమ - బాధ వంటి అంశాలను 'మీనాక్షి సుందరేశ్వర్' సినిమాలో ప్రస్తావిస్తున్నారు. కొత్త జంట మధ్య ఏర్పడిన దూరం వారి హృదయాలను దగ్గర చేస్తుందా? లేదా వారిని మరింత దూరం చేస్తుందా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో అభిమన్యు - సాన్య ఇద్దరూ తమిళ అమ్మాయి-అబ్బాయిగా కనిపిస్తున్నారు. టీజర్ బాగున్నప్పటికీ, తమిళ నేటివిటీకి తగ్గ నటీనటులను ఎంపిక చేయలేదని అనిపిస్తోంది.

అంతేకాదు ఈ టీజర్ చూసిన తర్వాత  'చెన్నై ఎక్స్‌ప్రెస్' '2 స్టేట్స్' వంటి సినిమాలు కూడా గుర్తుకు వస్తాయి. మరి 'మీనాక్షి సుందరేశ్వర్' సినిమా వాటికి భిన్నంగా ఎలా ఉంటుందో చూడాలి. 'లూడో' వంటి సక్సెస్ ఫుల్ సినిమాతో డిజిటల్ డెబ్యూ ఇచ్చిన సన్యా మల్హోత్రా కు ఇది రెండో నెట్ ఫ్లిక్స్ వెబ్ ఫిల్మ్. వచ్చే నెల 5వ తారీఖున ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.

Full View
Tags:    

Similar News