ఫోటో స్టోరీ : మీరా జాస్మిన్.. ఈసారి మరింత బోల్డ్ గా..!

Update: 2022-10-21 04:00 GMT
సౌత్ సినీ ప్రేక్షకులను అలరించిన మళయాళ భామల్లో మీరా జాస్మిన్ కూడా ఒకరు. తెలుగులో తక్కువ సినిమాలే నటించినా సరే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మీరా జాస్మిన్. మాతృ భాష మళయాళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించిన ఆమె తమిళ, కన్నడ భాషల్లో కూదా నటిస్తూ వచ్చింది. తెలుగులో కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, ఆకాశ రామన్న సినిమాలు చేసింది. 2013లో వచ్చిన మోక్ష తర్వాత అడ్రెస్ లేకుండాపోయింది. గత ఏడు ఎనిమిది ఏళ్లుగా కేవలం మళయాళ సినిమాలే చేస్తూ కెరియర్ నెట్టుకొస్తున్న మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో కొత్తగా ఎంట్రీ ఇచ్చింది.   

స్టార్ హీరోయిన్ గా సౌత్ ఆడియన్స్ నుంచి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మీరా జాస్మిన్ అంతకుముందు చాలా పద్ధతిగా.. ట్రెడిషనల్ లుక్ తో కనిపించింది. అయితే రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ సరికొత్త జోష్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సినిమాలు చేస్తున్న టైం లో కనీసం నడుము అందాలు కూడా చూపించడానికి ఇష్టపడని మీరా జాస్మిన్ ఇప్పుడు ఏకంగా తన అందాలన్నిటిని గుమ్మరించేస్తుంది.

మీరా లో ఈ మార్పు ఎందువల్ల అన్నది తెలియదు కానీ ఆమెని తన సినిమాల పాత్రలతో అభిమానించిన ఫ్యాన్స్ కి అమ్మడు చేస్తున్న హాట్ షో ఒకింత షాక్ కి గురి చేస్తుందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తూనే హాట్ ఫోటోతో సర్ ప్రైజ్ చేసిన మీరా జాస్మిన్ అప్పటినుంచి కావాలని రెచ్చిపోతుంది.    

లేటెస్ట్ గా మరో హాట్ ఫోటోని షేర్ చేసి అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది మీరా జాస్మిన్. గ్లామర్ ఎటాక్ తో కుర్రాళ్లని డిస్ట్రబ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే అమ్మడు ఎక్కడ తగ్గట్లేదు. లేటెస్ట్ గా ఉల్లిపొర లాంటి డ్రెస్ తో లోపల అందాలన్ని కనిపించేలా మీరా జాస్మిన్ ఫోటో షేర్ చేసింది.

హీరోయిన్ గా చేసినప్పటి కన్నా ప్రస్తుతం షేర్ చేస్తున్న ఫోటోలు ఆమెకు ఎక్కువ క్రేజ్ తెస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమధ్య బ్రా తో దిగిన ఫోటోలతో హంగామా చేసిన మీరా జాస్మిన్ సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకే ఇలా చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా మీరా జాస్మిన్ గ్లామర్ షో ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News