‘మెగా బ్లాక్ బస్టర్’ అంటూ పలువురు సెలబ్రిటీలు పోస్టర్స్ రిలీజ్ చేస్తుండటం మనం చూస్తున్నాం. మొదట కపిల్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ పోస్టర్ ను షేర్ చేయగా.. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అదే టైటిల్ తో పోస్ట్ పెట్టింది. దక్షిణాది స్టార్ హీరోయిన్లు త్రిషా కృష్ణన్ మరియు రష్మిక మందన్నా కూడా ఈ పోస్టర్ గ్యాంగ్ లో చేరారు.
తమిళ హీరో కార్తీ కూడా 'మెగా బ్లాక్ బస్టర్' పోస్టర్ పై కనిపించాడు. ఇదే క్రమంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా ఇందులో జాయిన్ అయ్యాడు. ఇలా అందరూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి.. సెప్టెంబర్ 4న ట్రైలర్ రాబోతున్నట్లు ట్వీట్లు పెట్టారు. దీంతో అసలు వీరందరూ కలిసి ఎప్పుడు సినిమా చేశారు? అప్పుడే ట్రైలర్ విడుదల అంటున్నారు అనే చర్చలు మొదలయ్యాయి.
వీరందరూ కలిసి సినిమా చేసే అవకాశం లేదు. అందరూ తమ పోస్టర్స్ ను విడుదల చేయడం ద్వారా.. ఏదైనా సామాజిక అవగాహన కార్యక్రమం కోసం లేదా మరేదైనా ప్రచారంలో భాగంగా ఇలాంటి ప్రకటన చేస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే బీసీసీఐ చైర్మన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పోస్టుతో ఈ హడావుడి అంతా దేనికోసమో తేలిపోయింది.
మిగతా సెలబ్రిటీల మాదిరిగానే గంగూలీ కూడా 'మెగా బ్లాక్ బస్టర్' అంటూ ఓ పోస్టర్ ను లాంచ్ చేసాడు. షూటింగ్ చాలా ఫన్నీగా జరిగిందని.. ఇది త్వరలోనే రిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. అయితే ప్రమోషన్ పోస్టులు చేయడంలో పెద్దగా అనుభవం లేని గంగూలీ చిన్న పొరపాటు చేయడంతో దీని వెనకున్న అసలు విషయం బయటకు వచ్చింది.
‘మెగా బ్లాక్ బస్టర్’ పోస్టులో ‘మీషో’ యాప్ అని ఎక్కడా రాకుండా జాగ్రత్త పడాలంటూ ఆ యాడ్ రూపకర్తలు పంపిన మెసేజ్ ని గంగూలీ అలాగే ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసినా అప్పటికే జనాలకు అసలు కథ తెలిసిపోయింది.
'మెగా బ్లాక్ బస్టర్' అనేది స్పష్టంగా పొందిన “మీషో” అప్పెరల్ సెల్లింగ్ యాప్ యొక్క ప్రమోషన్ కోసం చేసింది. ఇప్పటికే మధ్యతరగతి సర్క్యూట్ లలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ దుస్తుల బ్రాండ్.. రాబోయే సీజన్ కోసం సెలబ్రిటీలతో స్పెషల్ ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 4న అందరికీ షాక్ ఇవ్వాలి అనుకుంటే.. గంగూలీ మీషో యాప్ కే షాక్ ఇచ్చారు.
ఇకపోతే ట్రైలర్ రిలీజ్ కాబోతోందంటూ దీన్ని ఒక సినిమా అనుకునేలా అభిమానులను తప్పుదారి పట్టించినందుకు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా 'మెగా బ్లాక్ బస్టర్' చుట్టూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరడంతో.. అప్పెరల్ బ్రాండ్ కు కావాల్సినంత ప్రచారం లభించిందనే చెప్పాలి. సెప్టెంబర్ 4న అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.