రామ్ గోపాల్ వర్మ తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు కానీ... తాను తీసిన గోతిలో తానే పడుతుంటాడు. తాజాగా కూడా అదే జరిగింది. తన మానానా తాను ఉండక శ్రీరెడ్డిని వెనకుండి నడిపించాడు. ఆ విషయాన్ని మళ్లీ తానే బయటపెట్టి ఇరుక్కున్నాడు. ఆర్జీవీ ఎప్పుడు దొరుకుతాడా అని చూసిన మెగా క్యాంప్‌కు శ్రీ రెడ్డి విషయంలో అడ్డంగా దొరికిపోయాడు ఆర్జీవీ. మెగా క్యాంప్ తరపున బన్నీ వాసు ఆర్జీవీ సంగతి తేలుస్తామంటూ ట్వీట్ లు చేశాడు. మెగా కాంపౌండ్ లో వర్మ గురించే చర్చ ఇప్పుడు.
వర్మకు మెగా హీరోలంటే ఎప్పటినుంచో పడదు. చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే అస్సలు పడదు. అవకాశం వచ్చినప్పుడల్లా వారిని పబ్లిగ్గానే విమర్శిస్తాడు. పవన్ కళ్యాణ్ ను అయితే మరీను. చివరికి పవన్‌కు గతేడాది కొడుకు పుట్టినప్పుడు కూడా విమర్శిస్తూ ట్వీట్ లు చేశాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంటూ రోడ్డు మీదకు వచ్చింది. కొన్ని రోజులు తన పోరాటాన్ని తాను చేసుకుంది. ఆమె వ్యవహారంలో కూడా వర్మ మధ్యలో దూరాడు. శ్రీరెడ్డిని తెగ పొగిడాడు. శ్రీరెడ్డి కూడా హఠాత్తుగా వాయిస్ మార్చేసింది. పవన్ కళ్యాణ్ ను విమర్శించడం బూతులు తిట్టడం ప్రారంభించింది. ఎందుకిలా చేస్తోందబ్బా అనుకుంటే అసలు విషయాన్ని వర్మే బయటపెట్టాడు. తానే శ్రీ రెడ్డి చేత పవన్ ను తిట్టించానని ఓ వీడియో పోస్టు చేసి అడ్డంగా దొరికిపోయాడు. క్యాస్టింగ్ కౌచ్ పోరాటంలోకి పవన్ ను లాగమని శ్రీరెడ్డికే తానే చెప్పానని బయటపెట్టాడు.
అసలే ఆర్జీవీ చేష్టలతో విసిగిపోయిన మెగా కాంపౌండ్ ఆ వీడియో ఆధారంగా దొరకడంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. మెగా కాంపౌండ్ తరపున బన్నీ వాసు ముందుండి వర్మకు వార్నింగ్ ట్వీట్ చేశాడు. తామెప్పుడు పవన్ అభిమానులను కూల్ గా ఉండమని చెబుతామని కానీ ఇప్పుడు నువ్వు ఆడిన డ్రామా మొత్తం తెలిసిందని ఇక ఊరుకోమని ట్వీట్ లో పేర్కొన్నాడు. తాము బయటికి వస్తున్నామని యుద్ధానికి సిద్ధంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా వర్మ డ్రామాలు ఆడాడని అన్నాడు. మెగా ఫ్యామిలీ అభిమానులమంతా సమావేశం అవుతామని - సాయంత్రం కల్లా ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ట్వీటు చేశాడు.