మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల విరామం తరువాత 'ఖైదీ నంబర్ 150'తో మళ్లీ కెమెరా ముందు కొచ్చారు. భారీ స్థాయిలో తమిళ రీమేక్ మూవీ 'కత్తి' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన చిరు సినిమాలకు దూరంగా వుండి పదేళ్లవుతున్నా తనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నిరూపింయింది. స్టార్ గా బాక్సాఫీస్ వద్ద చిరు స్థాయి ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. భారీ వసూళ్లని రాబట్టింది. కానీ ఆ తరువాత చిరు చేస్తున్న సినిమాలు మెగాస్టార్ రేంజ్ కి తగ్గ విజయాల్ని సొంతం చేసుకోలేకపోతున్నాయి.
'ఖైదీ నంబర్ 150' తరువాత చిరు నటించిన పీరియడిక్ మూవీ 'సైరా నరసింహారెడ్డి' చిరు రేంజ్ విజయాన్ని దక్కించుకోలేక ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక ఈ మూవీ తరువాత కరోనా కారణంగా ఆలస్యంగా విడుదలైన 'ఆచార్య' గురించి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలోని కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే 'ఆచార్య' ఏ విషయంలోనూ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేకపోయింది.
రిలీజ్ కు ముందు వరకు భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది. ఇక మలయాళ రీమేక్ 'లూసీఫర్' ఆధారంగా రీమేక్ అయిన 'గాడ్ ఫాదర్'తో అయినా చిరు సత్తా ఏంటో తేలుతుందని ఫ్యాన్స్ భావించారు. సినిమాపై భారీ అశలు పెట్టుకున్నారు. టాక్ బాగున్నా సినిమా ఆ స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోవండం గమనార్హం. టాక్ పాజిటివ్ గానే వున్నా ప్రేక్షకులు మాత్రం ఆశించిన స్థాయిలో థియేటర్లకు రావడం లేదు.
కారణం సినిమాలో ఫ్యాన్స్ ఆశించిన మ్యాజిక్ మిస్సవడమేనని తెలుస్తోంది. చిరుకు జోడీ లేకపోవడం ఓ మైనస్ కాగా.. మాస్ ని ఎట్రాక్ట్ చేసే ఫైట్స్ చిరు నుంచి లేకపోవడం కూడా ఓ ప్రధాన సమస్య మారిందని చెబుతున్నారు. ఫస్ట్ వీక్ హడావిడి చేసిన ఫ్యాన్స్ ఆ తరువాత నుంచి సైలెంట్ కావడానికి ప్రధాన కారణం కూడా అదేనని ఇన్ సైడ్ టాక్. సినిమా గురించి మేకర్స్ ఎంతగా చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా వుంది.
ఫస్ట్ వీక్ లో థియేటర్ల వద్ద కనిపించిన హడావిడీ సెకండ్ వీక్ లో కనిపించడం లేదు. కారణం 'గాడ్ ఫాదర్'లో చిరు మార్కు మెరుపులు లేకపోవడమే. ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతున్నారట. దీంతో ఇప్పడు అందరి దృష్టి బాబి డైరెక్షన్ లో చేస్తున్న'వాల్తేరు వీరయ్య'పై పడింది.
ఈ మూవీలో చాలా రోజుల తరువాత చిరు మాసీవ్ పాత్రలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఇదే చిరు రేంజ్ ని డిజైడ్ చేసే సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నారట. మరి వారి అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.