ఒక సినిమా హిట్ అయిందంటే దాదాపుగా క్రెడిట్ అంతా హీరో ఖాతాలోకే వెళ్తుంది. కొందరు డైరెక్టర్ల విషయంలో మాత్రం ఇది ఎక్సెప్షన్. అదే కనుక ఫ్లాప్ అయితే మాత్రం ఆ ఇంపాక్ట్ ఎక్కువగా పడేది మాత్రం దర్శకుడిపైనే. ఇప్పుడు 'వినయ విధేయ రామ' దర్శకుడు బోయపాటి శ్రీను పరిస్థితి అలాగే ఉంది. ఈ సినిమా విడుదలైన నాటి నుండి బోయపాటిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ను చూస్తే ఈ విషయమే మనకు అర్థం అవుతుంది.
నిజానికి ఎలాంటి దర్శకుడికైనా ఫ్లాపులు హిట్లు సహజమే. పోనీ లాజిక్ లేని సీన్ల గురించి మాత్రమే బోయపాటిని ట్రోలింగ్ చేస్తున్నారా అనుకుంటే తెలుగులో అసలు లాజిక్కులు ఉన్న ఎన్ని వస్తున్నాయి? అసలు మన సినిమాల్లో పాటలు.. ఫైట్లకు ఏం లాజిక్కులు చెప్తాం? ఒకవేళ సినిమాను ఫ్లాప్ గా మలచినందుకు బోయపాటిని టార్గెట్ చేస్తున్నారనుకుంటే ఈ సినిమా అంత ఘోరమైన ఫ్లాప్ కాదు. ఈ సినిమా రికవరీ 71%. సంక్రాంతి పోటీలో రిలీజ్ అయిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా రికవరీ 29%. గత ఏడాది 'అజ్ఞాతవాసి' విషయం తీసుకుంటే ఆ సినిమా రికవరీ కూడా 50% కంటే తక్కువే. మరి క్రిష్ మీద.. త్రివిక్రమ్ మీద ఆ రేంజ్ లో ట్రోల్ చేయని జనాలు బోయపాటి మీద మాత్రం ఎందుకు ఒంటికాలిపై లేస్తున్నారు?
బోయపాటి ట్రాక్ రికార్డ్ తీసుకున్నా వంకపెట్టలేనంత బెటర్ ట్రాక్ రికార్డ్ ఉంది. బోయపాటి సినిమాలోని మసాలాలు నచ్చని వారు ఉండొచ్చుగానీ ఆయన ట్రాక్ రికార్డును మాత్రం ఎవరూ వేలెత్తి చూపలేరు. భద్ర.. సింహా.. లెజెండ్.. సరైనోడు.. ఇది బోయపాటి హిట్ల లిస్టు. అయినా ఎందుకు ఆ రేంజ్ లో బోయపాటిని టార్గెట్ చేస్తున్నారు? నిర్మాత దానయ్యతో గొడవ జరిగిన తర్వాతే ఇలా బోయపాటిపై ట్రోలింగ్.. విమర్శలు ఎక్కువయ్యాయనే రూమర్లు విన్పిస్తున్నాయి. 'వినయ విధేయ రామ' విషయంలో తీవ్రంగా అప్సెట్ అయిన కొందరు మెగా ఫ్యాన్స్ కూడా ఈ ట్రోలింగ్ కు కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బోయపాటిని ఇలా టార్గెట్ చేయడం మాత్రం సరికాదని ఇండస్ట్రీలో సీనియర్లు అంటున్నారు.