మెగా రచ్చలో అభిమానులకే నిందలు

Update: 2015-07-16 17:35 GMT
చిరంజీవి అన్నా, మెగా ఫ్యామిలీ హీరోలన్నా మెగాభిమానులు ఎంతో ఇదైపోతారు. ఆ కుటుంబాన్ని కాచుకోవడానికి అభిమానులు దేనికైనా సిద్ధమే. కాని ఈ మధ్యన ఈ అభిమానులు ఒకింత మెగా రచ్చలో నలిగిపోతున్నారు. మెగా హీరోల పై ఎలాంటి కామెంట్లు వచ్చినా కూడా వీరు తమ మాట అడ్డేస్తారు కాని, ఈ మధ్యన వీరే తిరిగి క్రిటిసిజం ఫేస్‌ చేయాల్సి వస్తోంది.

నాలుగైదు వారాల క్రితం చిరంజీవి 150వ సినిమా నుంచి పూరీ ఔట్‌, వినాయక్‌ ఇన్‌ అన్న వార్త పుట్టిందే దరిమిలా కొన్ని వర్గాలు  చిరుని నిందించడానికి రెడీ అయిపోయాయి.  చిరు ఆలోచనల్లో స్థిరత్వం లేదు. పిఆర్‌పీని వదిలిపెట్టి కాంగ్రెస్‌ నుంచి వచ్చినట్టే ఇప్పుడు దర్శకుడిని కూడా మార్చేశారు అన్న నింద వేశారు. అయితే ఆ తర్వాత పూరి లైన్‌లోనే ఉన్నాడని చరణ్‌ ఓ క్లారిటీ ఇవ్వడంతో ఆ రచ్చ సెటిల్‌ అయ్యింది.

ఇక నిన్నగాక మొన్న రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద దాదాపు 30మంది భక్తులు తొక్కిసలాటలో మరణించినప్పుడు 'చంద్రబాబు సీఎం పదవి నుంచి తప్పుకోవాలి' అంటూ చిరు డిమాండ్‌ చేశారు. అసలు జనాల చావుని రాజకీయం చేస్తావేంటి? తమ్ముడిని చూసి నేర్చుకో అంటూ చాలా మంది కామెంట్ చేసారు . పవన్‌ కేవలం మరణించిన వారి తరపునే వకాల్తా పుచ్చుకుంటే చిరంజీవి మాత్రం రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారని విమర్శించారు. అంతెందుకు బాహుబలి రికార్డుల తో ముడివేసి చిరు 150వ సినిమా ని ఫుట్‌బాల్‌ ఆడేస్తున్నాడు రామ్‌గోపాల్‌ వర్మ.

ఇలాంటి ప్రతి సందర్భంలోనూ అభిమానులు మెగాస్టార్‌ కి అండగానే నిలిచి ప్రతివాదనలు చేస్తున్నారు. అవసరమైతే ప్రత్యర్థుల నుంచి చీవాట్లు  తింటున్నారు. ఆన్‌లైన్‌ లో ట్వీట్లు కామెంట్లతో చిరంజీవిని సమర్ధిస్తున్నారు. మెగా హీరోల జీవితాల్లో ప్రతి సంఘర్షణలోనూ అభిమానుల ప్రమేయం ఉంటుంది. అందులో కాపు కాచేది అభిమానులే. కాని ఏం లాభం,
Tags:    

Similar News