మెగా ఫ్యామిలీ ఒక ఫ్యాక్టరీ అయిపోయిందే

Update: 2016-02-24 22:30 GMT
మెగాస్టార్ వారసులుగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన హీరోల లెక్క చాలానే ఉంది. అఫ్ కోర్స్.. ఓ హీరోయిన్ కూడా వచ్చేస్తోంది. ఇప్పుడీ ఫ్యామిలీలో హీరోల రేంజ్ చూస్తే వన్ స్టాప్ షాప్ అనిపించక మానదు. లో ఎండ్ నుంచి హైఎండ్ వరకూ.. ఈ ఫ్యామిలీలో ప్రతిస్థాయిలోనూ యాక్టర్స్ ఉండడం విశేషం.

టాప్ రేంజ్ హై బడ్జెట్ మూవీ తీయాలని అనుకుంటే.. చిరు ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ - ఆ తర్వాత రామ్ చరణ్ తేజ్ మొదటగా గుర్తొస్తారు. ఒక వేళ ఆ స్థాయికి ఒక మెట్టు తగ్గి మూవీ తీయాలంటే.. నెక్ట్స్ ఆప్షన్ అల్లు అర్జున్. మిడిల్ రేంజ్ బడ్జెట్ తో మూవీస్ చేసేవాళ్లకోసం వరుణ్ తేజ్ - సాయిధరం తేజ్ లు సిద్ధంగా ఉంటారు. లో బడ్జెట్ అంటే మరీ తక్కువ కాకుండా ఓ ఐదారు కోట్లతో సినిమా చేసేవాళ్ల కోసం అల్లు శిరీష్ ను లైన్ లో పెట్టుకోవచ్చు. ఇక హీరోయిన్ గా నీహారిక రేంజ్ ని ఆమె లాంఛింగ్ మూవీ తర్వాత చెప్పగలుగుతాం. ఇదంతా హీరోల లెక్క అయితే.. నిర్మాణ సంస్థలు కూడా లైన్ లో ఉన్నాయి.

ఈ ఫ్యామిలీ అండర్ లో ఉన్న బ్యానర్ లకు బోలెడంత వాల్యూ ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు తీయడం కోసం అయితే అల్లు అరవింద్ కి గీతా ఆర్ట్స్, చిరంజీవి సోదరుడు నాగబాబుకి అంజనా ప్రొడక్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని రన్ చేస్తున్నారు. అల్లు అరవింద్ రీసెంట్ గా గీతాఆర్ట్స్2 అంటూ చిన్న చిత్రాల కోసం ప్రత్యేకమైన బ్యానర్ ను స్టార్ట్ చేశారు. ఇక చెర్రీ కూడా రెండు బ్యానర్స్ స్టార్ట్  చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి చిరు ఫ్యామిలీ అంటే ఓ ఫిలిం ఫ్యాక్టరీయే.
Tags:    

Similar News