మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం ''గని''. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
బాక్సర్ గా వరుణ్ అందరి ప్రశంసలు అందుకున్నా.. సినిమా మాత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. దీనికి తోడు కొన్ని రోజుల గ్యాప్ లోనే 'బీస్ట్' 'కేజీయఫ్ 2' వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవడంతో.. ఫస్ట్ వీక్ లోనే 'గని' మూవీ థియేటర్లలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
అయితే బిగ్ స్క్రీన్ మీద 'గని' చిత్రాన్ని మిస్ అయిన సినీ అభిమానులకు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ పై చూసే అవకాశం వచ్చింది. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో ఈ బాక్సింగ్ డ్రామా విడుదలకు సిద్ధమైంది. రేపు శుక్రవారం (ఏప్రిల్ 22).. అంటే ఈ అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
బాక్సింగ్ లో ఛాంపియన్ షిప్ సాధించాలని కలలు కనే ఓ యువకుడు.. ఈ క్రమంలో ప్రత్యర్ధుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఏమి చేశాడు? తన కలను ఎలా సాకారం చేసుకున్నాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో 'గని' సినిమా తెరకెక్కింది.
'గని' చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నదియా కీలక పాత్రలు పోషించగా.. నరేష్ - తనికెళ్ళ భరణి - నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ మరియు రెనసాన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై అల్లు వెంకటేష్ (బాబీ) - సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. అబ్బూరి రవి సినిమాలో సంభాషణలు రాశారు.
జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇటీవల ఆహా ఓటీటీ రిలీజ్ చేసిన 'గని' స్పెషల్ కట్ ట్రైలర్ అలరించింది. మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ మెగా మూవీ.. స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.