మెగా Vs నందమూరి.. ఈ ఫ్యాన్స్ ఎప్పటికి మారుతారో..?

Update: 2022-08-10 04:13 GMT
సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా నందమూరి అభిమానులు - మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ ట్వీట్ల వార్ మరింత ఎక్కువైందని చెప్పాలి.

గత కొన్ని వారాలుగా కళతప్పిపోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ కు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' చిత్రం ఊపిరి పోసింది. అద్భుతమైన రెస్పాన్స్‌ తో హౌస్‌ ఫుల్ కలెక్షన్స్‌ తో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ అందుకొని, ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది.  

నిజానికి కొన్ని ఏరియాల్లో మెగా తండ్రీకొడుకులు చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' కంటే 'బింబిసార' మెరుగైన నంబర్స్ ను నమోదు చేసింది. దీంతో ఓ వర్గం నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #MegastarKalyamRam అనే హ్యాష్‌ ట్యాగ్‌ ని సృష్టించి, ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు.

దీనికి కౌంటర్‌ గా మెగా అభిమానులు #YoungTigerKalyanRam అనే హ్యాష్‌ ట్యాగ్‌ ని రన్ చేయడం ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్‌ కి మంచి సినిమాలున్నాయని.. అతనికే 'యంగ్ టైగర్' అనే టైటిల్ సూట్ అవుతుందని ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇలా నందమూరి - మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. పాండమిక్ తర్వాత 'అఖండ' 'RRR' 'బింబిసార' సినిమాలతో టాలీవుడ్ కు నందమూరి హీరోలు రక్షకులుగా నిలబడ్డారని.. ఈ విషయంలో మెగా హీరోలు ఫెయిల్ అయ్యారని ఓ వర్గం అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గత రికార్డులను కూడా పరిగణనలోకి తీసుకొని మాట్లాడాలని మెగా వర్గం కౌంటర్ ఇస్తున్నారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా సమయంలోనే ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. సక్సెస్ క్రెడిట్ తమ హీరోకే దక్కుతుందని.. మీ హీరో సైడ్ క్యారక్టర్ చేసారంటూ ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకున్నారు. అప్పుడు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనే ట్యాగ్ ఎవరికి సొంతం అనే విషయం మీద ఫ్యాన్స్ ఫైట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి మెగా vs నందమూరి అనుకునేలా ట్వీట్ వార్ చేసుకుంటున్నారు.

వాస్తవానికి మెగా - నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. అయినప్పటికీ ఇరు వర్గాలు సన్నిహితంగానే మెలుగుతుంటాయి. నందమూరి ఫ్యామిలీకి చెందిన తారకరత్నకు పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని పిలిచేంత చనువు ఉంది. తారక్ - చరణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ట్రిపుల్ ఆర్ తో అది మరింత బలపడింది.

కానీ ఈ ఫ్యాన్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మెగా vs నందమూరి అనుకునేలా సిల్లీ వార్స్ కి దిగుతున్నారు. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ ఆనందం పొందుతున్నారు.  హిట్లు ప్లాప్స్ అనేవి ఇండస్ట్రీలో సర్వసాధారణం. రికార్డులనేవి శాశ్వితం కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇతర స్టార్స్ ను కించపరచకుండా.. తమ హీరో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇరు వర్గాల అభిమానులకు మంచిది.
Tags:    

Similar News