మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొన్ని నెలల క్రితం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన స్పోర్ట్స్ బైక్ పై ఐకియా మీదుగా గచ్చిబౌలి వెళుతూ యాక్సిడెంట్ కి గురి కావడం పలువురిని షాక్ కు గురిచేసింది. ఈ ప్రమాదం తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. కోలుకున్న తరువాత వెంటనే తేజ్ ని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ తరువాత కూడా ఆయన మీడియా కంటపడకుండా ఇంటి పట్టునే వుంటూ విశ్రాంతి తీసుకున్నారు.
తేజ్ డిశ్చార్జ్ అయ్యారన్న వార్తలు మెగా అభిమానుల్లో సంతోషాన్ని నింపడమే కాకుండా గత కొన్ని రోజులుగా వారిలో నెలకొన్న కలవరాన్ని పోగొట్టింది. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటూ ఇంటి పట్టునే వుంటున్న సాయ్ ధరమ్ తేజ్ పై మరో పుకారు మొదలైంది. ఆయనకు ప్రమాదం కారణంగా వాయిస్ లో ఇబ్బందులు తలెత్తాయని ప్రచారం మొదలైంది. ఈ పుకార్లు మెగా అభిమానుల్లో భాయందోళనలు కలిగించాయి.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత నుంచి సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ కానీ, వీడియో బైట్ కానీ బయటికి రాలేదు. దీంతో జరుగుతున్న ప్రచారం నిజమనే వదంతులు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా బయటికి వచ్చిన ఓ వీడియో ఈ పుకార్లకు చెక్ పెట్టింది.
శినవారం మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులంతా సంక్రాంతి జరుపుకుంటున్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోని స్వయంగా మెగాస్టార్ తన మొబైల్ ఫోన్ తో షూట్ చేయడం విశేషం. అదే వీడియోని సోషల్ మీడియా ట్విట్టర్ వేదకగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో చిరంజీవి, సురేఖ, అల్లు అరవింద్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నాగబాబులతో కలిసి సాయి ధరమ్ తేజ్ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు.
దీంతో అతని వాయిస్ గురించి వైరల్ అవుతున్న పుకార్లకు చెక్ పడినట్టయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తిక్ దండు డైరెక్షన్ లో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది.