ప్రామిసింగ్ హీరో ఆది పినిశెట్టి నటించిన తాజా చిత్రం ''క్లాప్". తెలుగు, తమిళ బైలింగ్వల్ గా వస్తున్న ఈ చిత్రానికి 'ది సౌండ్ ఆఫ్ సక్సెస్' అనేది ఉపశీర్షిక. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'మళ్లీ రావా' ఫేమ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీజర్ లాంచ్ తో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిత్ర టీజర్ ను విడుదల చేసి టీమ్ మొత్తానికి విషెస్ అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ''నా స్నేహితుడు మరియు దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు, ఆది పినిశెట్టి ఒక వర్సటైల్ యాక్టర్. అతను కూడా మా కుటుంబ సభ్యుడే. యంగ్ డైరెక్టర్ పృథ్వీ ఆదిత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ దర్శకుల ప్రయోజనం ఏమిటంటే వారు అన్ని ప్రయత్నాలు చేస్తారు.. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి వారి టాలెంట్ ని చూపిస్తారు. సినిమా కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం అద్భుతమైన ఆలోచన. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ క్రీడా ఆధారిత చిత్రం నిరాశపరచలేదు'' అని అన్నారు.
'క్లాప్' అనేది అథ్లెటిక్స్ ఆధారంగా తీసిన సినిమా అనిపిస్తుంది. ఆది ఒక ఛాలెంజింగ్ పాత్రను పోషించాడు. ఈ పాత్రలో ఒక ట్విస్ట్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. అది చూసినప్పుడు నాకు వావ్ అనిపించింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన సినిమా కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆది - పృథ్వీతో పాటుగా ఇతర తారాగణం మరియు చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని చిరంజీవి అన్నారు.
టీజర్ విషయానికి వస్తే.. 'నా పేరు విష్ణు.. నాకు తెలిసిందంతా..' అంటూ ఆది పినిశెట్టి చెప్పడంతో ప్రారంభమైంది. అతనొక దూకుడు స్వభావం కలిగిన స్ప్రింటర్ గా కనిపిస్తున్నాడు. అయితే విష్ణు కలను నెరవేర్చుకునే క్రమంలో పెద్దగా సపోర్ట్ లభించడం లేదు. అతను హాకీ ప్లేయర్ అయిన ఆకాంక్ష సింగ్ ని ప్రేమిస్తున్నాడు. స్టేట్ లెవల్ లో ఈజీగా విజయం సాధిస్తావ్.. కానీ నేషనల్ లెవల్ లో ఓ గోల్డ్ గెలమని ప్రకాష్ రాజ్ అతన్ని మోటివేట్ చేస్తున్నారు. అయితే టీజర్ చివరలో ఆది ని ఒక కాలు పోగొతున్న వ్యక్తిగా చూపించి సినిమాలో ఏదో బలమైన కంటెంట్ ని చూపించబోతున్నారని అర్థం అవుతోంది.
అథ్లెట్ గా కనిపించేందుకు ఆది కఠినమైన శిక్షణ తీసుకొని అసాధారణమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ చిత్రంలో కృష్ణ కురూప్ - నాజర్ - బ్రహ్మాజీ - మైమ్ గోపి - రాందాసు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ పృథ్వీ ఆదిత్య అద్భుతమైన రచన మరియు టేకింగ్ - సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కుమార్ కెమెరా పనితనం ఆకట్టుకున్నాయి. మాస్ట్రో ఇళయరాజా అందించిన హృదయాన్ని తాకే బీజీఎమ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి రాగుల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐ.బి. కార్తికేయన్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శర్వంత్ రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ షిర్డీసాయి మూవీస్ పతాకాలపై రూపొందిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి - ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'క్లాప్' సినిమా ట్రైలర్ మరియు ఆడియో త్వరలో విడుదల కానున్నాయని మేకర్స్ తెలిపారు.
Full View