మెగాస్టార్ చిరంజీవి మాసియెస్ట్ థియేటర్ స్టాండీస్!

Update: 2022-12-16 06:30 GMT
'వాల్తేరు వీర‌య్య' వేట‌కి సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 13 నుంచి థియేట‌ర్ల‌లో వీర‌య్య వేట మొద‌ల‌వుతుంది. ఆ ముందు రోజు బాల‌య్య వీర‌సింహారెడ్డిగా ర‌చ్చ మొద‌లు పెడ‌తారు. అటుపై బాల‌య్య‌ని ఎదుర్కుంటూ వీర‌య్య వేట కొన‌సాగుతుంది. రెండు సినిమాల్నినిర్మిస్తోంది ఒకే సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలివైన స్ర్టాట‌జీతో రెండు సినిమాల్ని ప్ర‌చారం చేస్తోంది.

బాల‌య్య‌.. వీర‌య్య మ‌ధ్య ప్రత్య‌క్ష పోటీకి మైత్రీనే తెర  దించిందా? అన్న రేంజ్ లో జిమ్మిక్కులు ప్లే చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌కు  మంచి స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. 'బాస్ పార్టీ పాటకి  ఏకంగా  25 మిలియన్ల  వ్యూస్ ద‌క్కాయి. దీంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో సోష‌ల్  మీడియాలో మ‌రింత జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తుంది.

తాజాగా మేకర్స్ తదుపరి స్థాయి అవుట్‌డోర్ ప్రమోషన్‌లకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు స్టాండీలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో కొద్ది సేప‌టి క్రిత‌మే స్టాండీస్‌పై ఉండే చిరంజీవి కొత్త  పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో  మెగాస్టార్ మ‌రో మాసీవ్ లుక్ క‌నిపిస్తున్నారు.

చేతికి బెయిల్.. వెనుక తుపాకులు..తుటాలు  క‌నిపిస్తున్నాయి. ఇది  భారీ యాక్ష‌న్  షాట్  నుంచి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  ఇంకా ఇలాంటి  స్టైలిష్ యాక్ష‌న్ పోస్ట‌ర్లెన్నో ఉన్నాయి. బాబి చెప్పిన‌ట్లు ఇది ప‌క్కా మాస్ చిత్ర‌మ‌ని మ‌రోసారి రుజువైంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్  నుంచి నేటి వ‌ర‌కూ చిరంజీవి ప్ర‌తీ పోస్ట‌ర్ మాస్ ఆడియ‌న్స్ లో పున‌కాలు తెప్పిచేలానే క‌నిపిస్తుంది.  

థియేటర్లలో ఈ ఎపిసోడ్‌కి 'పూనకాలూ గ్యారెంటీ' అంటున్నారు దర్శకుడు బాబీ.  మెగా ఫ్యాన్స్ ఇంకెంతమాత్రం వెయిట్ చేయలేరు. '#వాల్తేరు వీరయ్యలో మా మెగాస్టార్ @Kchirutweets యొక్క కొత్త అవతార్‌ను మీకు అందిస్తున్నాను.

ఈ పోస్టర్ నమూనా మాత్రమే.  ఈ ఎపిసోడ్  మొత్తానికి థియేట‌ర‌ల‌లో  పూనకాలు గ్యారెంటీ. ఇది నా  హామీ'అంటూ  బాబీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చిరంజీవి మరియు శృతి హాసన్‌లపై యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News