చిరంజీవి వరుస సినిమాలతో సక్సెస్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో తరహాలో అయితే ఆయన పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆడియన్స్ కు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అదే తరహాలో సినిమాలు చేయాలి అని ఆలోచనతో ఆయన ప్రయోగాలకు దూరంగా ఉండటం కూడా కొంత మైనస్ గా మారింది.
అయితే మెగాస్టార్ మాత్రం ఏ మాత్రం నిరుత్సాహ పరచకుండా తన ఒప్పుకున్న సినిమాలను ప్లాన్ ప్రకారం పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా మొదట పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ సినిమా చేసిన బిజినెస్ కు వచ్చిన కలెక్షన్స్ కొంత తేడా అయితే ఉంది. చాలావరకు ఏరియాలో ఈ సినిమా నష్టాలు మిగిల్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక గాడ్ ఫాదర్ సినిమా గురించి దాదాపు మర్చిపోయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాను రంగంలోకి దింపాలి అని రెడీ అవుతున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్న విషయం తెలిసిందే.
అయితే నిర్మాత అనిల్ సుంకర కూడా అదే సమయానికి ఏజెంట్ ను తీసుకురావచ్చట. కాబట్టి ఈ సినిమా వాయిదా పడవచ్చు అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా సంక్రాంతికి వచ్చినా రాకపోయినా కూడా ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈనెల 24 నుంచి వాల్తేరు వీరయ్య కు సంబంధించిన అప్డేట్స్ తో హడావిడి మొదలు కాబోతోంది. ఈ సినిమాకు ముందుగా టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే మొదటి సాంగ్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో మాస్ మహారాజ రవితేజ ప్రత్యేకమైన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అక్టోబర్ 24 నుంచి అప్డేట్స్ ద్వారా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలుగా రచిస్తున్నారు. మరి ఈ హడావిడి సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.