మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడు రెండో సినిమా కొండపొలం విడుదలైంది. రిలీజ్ ముందే కొండపొలం ట్రైలర్ హైప్ క్రియేట్ చేసింది. వైష్ణవ్ - రకుల్ ప్రీత్ నడుమ రొమాన్స్.. ఇందులో వైష్ణవ్ పాత్ర చిత్రణ.. పులి కాన్సెప్ట్ ప్రతిదీ కొత్తగా అనిపించాయి. అడవి నేపథ్యం పచ్చదనం నేపథ్యంలో ప్రయోగాత్మక థ్రిల్లర్ మూవీ ఇదని అర్థమైంది.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జే సాయి బాబు.. వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలైంది. కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఈ చిత్రానికి స్ఫూర్తి. ఇక రిలీజ్ ముందే మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకించి ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ వేసి చూపించింది టీమ్. కొండపొలం వీక్షణ అనంతరం వైష్ణవ్ పైనా.. దర్శకుడు క్రిష్ పైనా ప్రశంసలు కురిపించారు చిరంజీవి.
చిరంజీవి మాట్లాడుతూ -``వైష్ణవ్ వచ్చి క్రిష్ తో సినిమా అనగానే ఓకే చేశా .. సినిమాను అద్భుతంగా తీశారు. ఇందులో అందమైన లవ్ స్టోరీ ఉంది. అలాగే ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అనే మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు`` అన్నారు మెగాస్టార్. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు క్రిష్ కూడా చిరుకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు. కెరీర్ ఆద్యంతం ముందుకు సాగడానికి.. పట్టుదలతో ఉండటానికి నాకు బలాన్ని ఇచ్చింది మీరే మెగాస్టార్ అంటూ క్రిష్ ఎమోషనల్ అయ్యారు. తమను ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.