మెగాస్టార్‌, మాస్ రాజా సూపర్‌ మాస్‌ సాంగ్‌...!

Update: 2022-10-22 08:50 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో సినిమాలు వచ్చాయి. కానీ అప్పట్లో రవితేజ స్టార్‌ కాదు.. కానీ ఇప్పుడు రవితేజ ఒక స్టార్‌.. కనుక వీరిద్దరి కాంబో పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

భారీ ఎత్తున సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రవితేజ పాత్ర ఈ సినిమాలో మొన్నటి వరకు చిన్న చితకా అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా లో దాదాపుగా సగం వరకు రవితేజ కనిపిస్తాడట.. కథలో అత్యంత కీలకంగా ఆయన పాత్ర ఉంటుందట.

అంతే కాకుండా మెగాస్టార్‌ చిరంజీవి మరియు రవితేజ కాంబోలో వచ్చే సాంగ్‌ కి అంతా కూడా ఫిదా అవ్వబోతున్నారట.

వీరిద్దరి కాంబో లో రాబోతున్న సాంగ్‌ కోసం  సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ చాలా ప్రత్యేకమైన మాస్ బీట్‌ ను ట్యూన్‌ చేయించాడట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ఆయన అభిమానులు చిరంజీవి.. బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాల్తేరు వీరన్న అంటూ టైటిల్‌ ను మొదట అనుకున్నారు. కానీ టైటిల్‌ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

దీపావళి సందర్భంగా టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని దర్శకుడు బాబీ ప్లాన్‌ చేస్తున్నాడట. బాబీ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా చాలా నమ్మకం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News