మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న `ఆచార్య` ఎట్టకేలకు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో వచ్చేశాడు. తండ్రీ కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి చేసిన సినిమా ఇది. ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ ఈ శుక్రవారం ఏప్రిల్ 29న బారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో అతనికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలి రోజే కొంత నిరాశ పరిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్లు గా చిరు సినిమా కోస ఎదురుచూసిన అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా లేదని అంటున్నారు. దీంతో ఈ మూవీకి తొలి ఆట నుంచే డివైడ్ టాక్ మొదలైంది. 800 ఏళ్ల చరిత్ర వున్న టెంపుల్ టౌన్ ధర్మస్థలి. ధర్మానికి, ఆయుర్వేద వైద్యానికి అది ప్రసిద్ధి. అక్కడ అధర్మం చోటు చేసుకున్నప్పుడు అమ్మవారే ఏదో ఓ రూపంలో వచ్చి ధర్మాన్ని నిలబెడుతూ వుంటుంది. అమ్మవారి పాదాల చెంత ధర్మమే పరమావధిగా నివశిస్తున్న ఓ చిన్న తండాకు పాదఘట్టం అని పేరు.
ఆ పాదఘట్టం, దాని పక్కన వున్న సిద్ధవనంపై కొంత మంది అక్రమార్కుల కన్ను పడుతుంది. టెంపుల్ టౌన్ ధర్మస్థలిలో బసవ పాగా వేస్తాడు. ఎదురొచ్చిన వాళ్లని అంతం చేస్తూ అరాచకాలు సృష్టిస్తుంటాడు. అదే సమయంలో ధర్మస్థలికి ఆచార్య వస్తాడు. అతనికి ధర్మస్థలికి వున్న అనుబంధం ఏంటీ? .. సిద్ధకు తనకు వున్న బంధం ఏంటీ? అన్నదే అసలు కథ. సినిమా గురించి, దాని టాక్ గురించి పక్కన పెడితే ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి లుక్ ఇప్పడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సూర్యుడు ఉదయిస్తుండగా మెగాస్టార్ ఎంట్రీని చూపించిన తీరు బాగుంది.
ఇక ఆలీవ్ గ్రీన్ జీన్స్..బ్రౌన్ కలర్ షర్ట్.. మెడలో బ్యాగ్.. చేతిలో గొడ్డలి పట్టుకుని రాజసం ఉట్టిపడేలా చిరు ధర్మస్థలిలోకి ఎంట్రీ ఇచ్చిన తీరుకు ఫ్యాన్స్ శివాలెత్తిపోతున్నారు. ఆరు పదులు దాటిన చిరులో అదే గ్రేసు..అదే స్టైల్ ఏమాత్రం తగ్గలేదంటూ మాస్టర్.. మాస్టర్ అంటూ థియేటర్లలో అభిమానులు కేకలు పెడుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ లోనూ చిరు యంగ్ గా కనిపించి రఫ్ఫాడించేశారు. సినిమాలో చరణ్ పాత్ర ఎంత హైలైట్ గా నిలిచిందో చిరు కూడా అంతే హైలైట్ అయ్యారు.
లుక్ పరంగా, గ్రేస్, స్టైల్ పరంగా చిరు ఏ మాత్రం తగ్గేదేలే అనే స్థాయిలో కనిపించిన తీరుకి ఫ్యాన్స్ ఇప్పడు పండగ చేసుకుంటున్నారు. సినిమాలోని పాటల్లోనూ చిరు మరోసారి 90వ దశకంలో ఏ జోరుతో కనిపించారో అదే జోరుని ఈ సినిమాలోనూ చూపించి ఆశ్చర్యపరచడం విశేషంగా చెప్పుకుంటున్నారు. చిరు తన గ్రేస్ కి తగ్గ కథ మళ్లీ పడితే నా విశ్వరూపం చూపిస్తానని ఇటీవల `ఆచార్య` ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. అది `ఆచార్య` సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ని చూస్తే అక్షకరాలా నిజమే అనిపిస్తుంది.