మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి రీమేక్ అనే విషయం తెల్సిందే. అక్కడ మోహన్ లాల్ నటించగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పెద్దగా మార్పులు లేకుండా కాస్త నేటివిటీ మార్చి తెలుగు లో ఈ సినిమాని రీమేక్ చేశారు.
ఈ సినిమాలో కీలక పాత్రలో నయనతార నటించడంతో పాటు గెస్ట్ రోల్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ ఇద్దరికి కూడా బాలీవుడ్ లో మంచి స్టార్ డమ్ ఉంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఏదైనా సినిమాలో అయిదు పది నిమిషాలు కనిపించినా చాలు అన్నట్లుగా అభిమానులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అలాంటిది గాడ్ ఫాదర్ సినిమాలో చాలా సమయమే సల్లూ భాయ్ కనిపిస్తాడట. అయినా కూడా హిందీలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపించడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఉండటంతో హిందీలో తప్పకుండా మంచి బజ్ ఉండే అవకాశం ఉంది.. కనుక అక్కడ రిలీజ్ చేయాలని చాలా మంది అడిగారట.
హిందీ డిస్టిబ్యూటర్స్ కూడా కొందరు గాడ్ ఫాదర్ ని అక్కడ డబ్ చేసేందుకు ఆసక్తి చూపించారట. కానీ చిరంజీవి మాత్రం హిందీ లో సినిమా విడుదలకు ఓకే చెప్పలేదని టాక్. సల్మాన్ ఖాన్ పేరుతో అక్కడ సినిమాను భారీ మొత్తానికి అమ్మి క్యాష్ చేసుకోవడం చిరంజీవికి ఇష్టం లేదని కొందరు అంటున్నారు.
మొత్తానికి హిందీలో విడుదలకు హక్కులు ఇచ్చి ఉంటే భారీ మొత్తంలో ఆదాయం వచ్చి ఉండేది. కానీ ఆయన ఈ సినిమా ను అక్కడ ఎందుకో రిలీజ్ వద్దన్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ తెలుగు లో సినిమా హిట్ అయితే తప్పకుండా హిందీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.