ఆసుపత్రిలో కొడుక్కు మెగాస్టార్‌ పరామర్శ

Update: 2021-08-24 15:30 GMT
బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేతికి అయిన గాయంకు చికిత్స పొందుతున్నాడు. కొన్నాళ్ల క్రితం షూటింగ్‌ లో అభిషేక్ కు గాయం అయ్యింది. అది ఇప్పుడు తిరగబెట్టడంతో మళ్లీ అభిషేక్‌ బచ్చన్‌ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో అభిషేక్ కు చికిత్స అందిస్తున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కాని ఆయన విశ్రాంతి ఎక్కువ తీసుకోవాలంటూ వైధ్యులు సూచించారు అంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అబిషేక్ బచ్చన్‌ ఆసుపత్రిలో ఉండగా ఆయన్ను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులు క్యూ కట్టారు. కూతురు శ్వేతతో కలిసి అమితాబచ్చన్‌ లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో మీడియాతో ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. కొడుకు అభిషేక్ బచ్చన్ ను పరామర్శించిన మెగాస్టార్‌ అమితాబచ్చన్ అక్కడ కొద్ది సమయం ఉండి ఆ తర్వాత వెళ్లి పోయారు. ఐశ్వర్య రాయ్‌ ఆసుపత్రికి రాకపోవడంతో బాలీవుడ్‌ మీడియాలో రకరకాల పుకార్లు కథనాలు వస్తున్నాయి.

అసలు విషయం ఏంటీ అంటే ఐశ్వర్య రాయ్‌ కొన్ని రోజులుగా మణిరత్నం సినిమా లో నటిస్తున్న కారణంగా అభిషేక్ బచ్చన్‌ ను పరామర్శించేందుకు రాలేదని.. ఆమె ముంబయిలో దిగిన వెంటనే భర్త ఉన్న ఆసుపత్రికి వెళ్లబోతున్నట్లుగా బచ్చన్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారు అంటున్నారు. బాలీవుడ్‌ మీడియాలో ఈ విషయమై అతిగా వస్తున్న వార్తలపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News