మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ యాక్షన్ డ్రామా `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రచార కార్యక్రమాలలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొంటున్నారు. ఇటీవలే ఈ చిత్రంలో కోసం ఇద్దరిపై చిత్రీకరించిన ఓ లిరికల్ వీడియోని ఈ నెల 18న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి తన దగ్గరికి ఏ దర్శకుడు వచ్చినా కమర్షియల్ కథ కావాలని అడుగుతున్నారట.
ప్రస్తుతం ఏకంగా ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు చిరు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్ట్ చేసిన `ఆచార్య` విడుదలకు సిద్ధమవుతుండగా మరో నాలుగు చిత్రాల్లో మూడు చిత్రాలు ఇప్పటికే సెట్స్ పైకొచ్చాయి. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న `గాడ్ ఫాదర్`.. బాబీ డైరెక్ట్ చేస్తున్న `వాల్తేరు వీరయ్య` (టైటిల్ ఇంకా కన్ఫమ్ కాలేదు), `భోళా శంకర్` చిత్రాలు చిత్రీకరణ దశలో వున్నాయి. ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేయనున్న మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇదిలా వుంటే బ్యాక్ టు బ్యాక్ ఐదు చిత్రాలతో బిజీగా వున్న చిరు ఇప్పడు ప్రత్యేకంగా కమర్షియల్ కథని ఎందుకు అడుగుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కథ చిరు కోసం కాదు.. వరుణ్ తేజ్ కోసమని తెలిసింది. కమర్షియల్ కథ పడితే వరుణ్ రేంజ్ వేరుగా వుంటుంది. ఇదే ఇప్పడు చిరు ఆలోచన. ఇటీవల విడుదలైన `గని` దారుణంగా నిరాశ పరిచింది. వరుణ్ తేజ్ మార్కెట్ ని మరింత డల్ చేసింది. థియేట్రికల్ బిజినెస్ కూడా వరుణ్ సినిమా చేయలేదా? అనే స్థాయిలో ఈ సినిమా వరుణ్ కెరీర్ కి షాకిచ్చింది.
ఈ విషయం చిరు దాకా వెళ్లిందట. దీంతో వరుణ్ కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టడం కోసం చిరు రంగంలోకి దిగారట. అందులో భాగంగానే వరుణ్ కోసం పక్కా కమర్షియల్ కథని వెతుకుతున్నారట. ఆ కారణంగానే ప్రతీ దర్శకుడిని కమర్షియల్ కథ వుంటే చెప్పమని చిరు ఆరాతీస్తున్నారట. `గని` సినిమా విషయంలో ప్రారంభం నుంచి చిరు ఇన్ వాల్వ్ కాలేదు. మొత్తం బాధ్యతల్ని అల్లు వారే చూసుకున్నారు. అయితే ఫలితం బెడిసికొట్టడంతో అర్జెంటుగా వరుణ్ కి కమర్షియల్ హిట్ కావాలని చిరు ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ మూవీ చేస్తున్నారు. అయితే దీనికంటే ముందే కమర్షియల్ మూవీని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది చిరు ఆలోచన. అందుకే వరుణ్ కి తగ్గ కమర్షియల్ స్టోరీ కోసం చిరు అన్వేషిస్తున్నారట. వన్స్ స్టోరీ సెట్టయితే దీనికి సంబంధించిన పూర్తి విషయాలని చిరు స్వయంగా పర్యవేక్షించి సినిమాని పక్కాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.