వామ్మో.. ఈ కొత్తమ్మాయి దూకుడేంది?

Update: 2016-11-19 11:30 GMT
ఒరు పాక్క కథై.. తమిళంలో బాలాజీ అనే యువ దర్శకుడు రూపొందిస్తున్న చిన్న సినిమా ఇది. దీని హీరో కాళిదాసు కూడా చిన్న స్థాయి వాడే. ఇలాంటి సినిమాతో కథానాయికగా పరిచయమవుతన్న అమ్మాయి కోసం అటు తమిళంలో.. ఇటు తెలుగులో పెద్ద పెద్ద నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు.. మేఘా ఆకాశ్.

మేఘా తొలి సినిమా ఇంకా రిలీజే కాలేదు. ఆ సినిమా గురించి జనాలకు పెద్దగా పట్టింపు కూడా లేదు. ఐతే ఈ 20 ఏళ్ల చెన్నై బ్యూటీని గౌతమ్ మీనన్.. ధనుష్ హీరోగా తాను చేయబోయే సినిమాకు కథానాయికగా ఎంచుకోవడంతో అందరి దృష్టి తనపై పడింది. అదే పెద్ద హాట్ న్యూస్ అంటే.. ఇప్పుడు తెలుగులో రాబోతున్న రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమే కథానాయిక అంటున్నారు.

14 రీల్స్ బేనర్లో నితిన్ హీరోగా హను రాఘవపూడి తీయబోయే కొత్త సినిమాకు ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నట్లు రెండు రోజుల కిందట వార్తలొచ్చాయి. ఇంతలో అక్కినేని అఖిల్ రెండో సినిమాలో కూడా ఆమే హీరోయిన్ అంటున్నారు. ఈ చిత్రాన్ని రూపొందించబోయే విక్రమ్ కుమార్ కూడా మేఘా ఆకాశ్ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. ఈ సినిమాకు ఆమే హీరోయిన్ గా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్లు సమాచారం. తొలి సినిమా విడుదల కాకమునుపే మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ పట్టేసిన మేఘా.. మున్ముందు పెద్ద స్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News