సౌత్ ఇండియన్ని అంటున్న 'లై' బ్యూటి

Update: 2017-08-05 05:22 GMT
తెలుగులో హీరోయిన్లు తక్కువై పోయారు అనుకునే కొద్ది ఒక్కసారిగా  హీరోయిన్ల వెల్లువ వచ్చి పడింది. వచ్చినవాళ్ళు అందరూ కేరళ అమ్మాయిలు కావడం మరో విశేషం. వచ్చే వారం విడుదల అవుతున్న యంగ్ హీరో నితిన్ ‘లై ‘ సినిమాలో హీరోయిన్ మాత్రం సగం మలయాళం సగం ఆంధ్ర మరికొంచెం  తమిళ్ పూర్తిగా ఒక సౌత్ ఇండియన్. మేఘా ఆకాష్‌ ఇప్పుడు తెలుగులో పూసిన మరో కొత్త కమలం. ఈమె తొలి తెలుగు సినిమా విడుదల సందర్భంగా ఆమె చెప్పిన కొన్ని ముచ్చట్లు మీకోసం.

“నేను పూర్తి సౌత్ ఇండియన్ని తెలుసా?  ఎలా అంటే నేను పెరిగింది అంతా చెన్నై లో పని చేస్తుంది తెలుగులో పుట్టింది ఒక ఆంధ్ర అబ్బాయికి ఒక కేరళ అమ్మాయికి అని చెప్పింది. నా మొదటి సినిమా తెలుగులో అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. లై సినిమాలో నా పాత్ర కూడా నా నిజ జీవతంకు దగ్గరలో ఉంటుంది. నేను చాలా సరదా మనిషిని. ఎప్పుడు అల్లరి అల్లరి చేస్తూ సందడిగా ఉంటాను. నా చుట్టూ ఉన్నవాళ్లకి ఆ ఆనందాన్ని పంచుతాను'' అని చెప్పింది.

ఇంకా హీరో నితిన్ గురించి మాట్లాడుతూ “నితిన్ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. నాకు ఇది మొదటి సినిమా కాబట్టి కొంచం భయం వేసింది. కానీ నితిన్ నా షాట్స్ సరిగ్గా రావటం కోసం అందించిన సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను. ఇంకా డైరెక్టర్ హను రాఘవపూడి తో పని చేయడం నా అదృష్టం. నాలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ధైర్యానికి అతనే కారణం'' అని చెబుతుంది.

హీరో రామ్ సినిమా ఎందుకు అలా అయ్యింది అని అడిగితే “నాకు కూడా చాలా  భాదగా ఉంది. గౌతమ్ మీనన్ సినిమా కోసం ఇచ్చిన  డేట్స్ వలన  ఆ సినిమాలో నటించలేకపోయాను. తప్పకుండా రామ్ తో నేను మళ్ళీ నటిస్తాను'' అని చెప్పింది. మరి నితిన్ హీరోగా పవన్ కల్యాణ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న సినిమా సంగతి ఏంటంటే “అవును ఆ సినిమా కూడా చేస్తున్నాను. కథ విన్నాను నాకు అయితే భలే నచ్చింది. విన్న వెంటనే ఓకే చెప్పేశాను'' అంటోంది అమ్మడు మేఘా ఆకాష్‌.
Tags:    

Similar News