లై హీరోయిన్ సినిమా రిలీజవ్వుద్దా?

Update: 2017-08-14 05:36 GMT
సెన్సార్ బోర్డు వాళ్ళ మతిలేని పనులకు కొన్ని సినిమాలు విడుదల అవ్వడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలా ఆపడానికి కథ ఎప్పడూ అడ్డంకాలేదు కానీ కొన్ని నమ్మకాలు పై కొన్ని భావాలు పై ఏవైనా మాటలు ఉంటే వాటిని వాడవద్దు అని సూచిస్తుంది. అయితే కొన్ని పదాలు కొన్ని కథలుకు చాలా అవసరం అటువంటి అప్పుడు కూడా సెన్సార్ మొండిగా వాదించి తన పంతం నెగించుకుంటుంది. ఇక్కడే మన ఫిల్మ్ డైరెక్టర్లుకు సెన్సర్ వాళ్ళకి మధ్య విబేధం వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాంతీయ సినిమాకు తమిళ్ సెన్సార్ వాళ్ళు అలానే సినిమాను విడుదల చేయకుండా నిలిపివేశారు.

లై సినిమాలో అందరినీ ఆకట్టుకొన్న మేఘా ఆకాష్‌ తన మొదటి సినిమా ఇప్పటికీ విడుదలకాలేదు. లై సినిమా తెలుగులో తన మొదటి సినిమా అయినప్పటికి ఒక  తమిళ్ సినిమాలో లై కన్నా ముందే నటించింది. ‘ఓరు పక్కా కథై’  అనే తమిళ్ సినిమా ఇప్పుడు తమిళ్ ప్రాంతీయ సెన్సార్ ఆఫీసు లో సెన్సార్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో  కొన్ని సెక్సువల్ మాటలు ఉండటంతో వాటిని తొలిగించాలిని చెబుతున్నారు సెన్సర్ వాళ్ళు. కానీ సినిమా కథే దాని చుట్టూ ఉంటుంది ఇప్పుడు ఆ మాటలను తీస్తే ఎలా అని ఆ సినిమా టీమ్ ఆలోచనలో పడింది. ఈ సినిమా దాదాపుగా 2014లో షూటింగ్ మొదలుపెట్టారు, 2016లో విడుదల కావలసిన సినిమా. ఈ సినిమాలో ఈ లై హీరోయిన్ ఒక యుక్త వయసులో గర్భందాల్చిన అమ్మాయిగా నటించింది.

ఈ సినిమా కాకుండా మరో తమిళ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఎనై నోకి పాయుమ్ తొత’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. లై సినిమాలో మేఘా నటించడానికి ముఖ్యకారణం కూడా ఇతనే. గౌతమ్ మీనన్ ఆఫీసులో ఈమె ఫోటోలు చూసే లై టీమ్ సెలెక్ట్  చేసుకుంది.
 
Tags:    

Similar News