హర్ రమేష్ తెలుగులో దర్శకుడిగా మారడంలో కీలక పాత్ర పోషించింది యంగ్ టైగర్. అప్పటికే రెండు కన్న చిత్రాలని తెరకెక్కించిన మెహర్ రమేష్ పై నమ్మకంతో `కంత్రీ` సినిమాకి తారక్ అవకాశం కల్పించాడు. మెహర్ లో మాస్ ని ఎలివేట్ చేసే విధానం నచ్చి అతనికి అవకాశం కల్పించారు. కానీ భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన సినిమా ఎలాంటి ఫలితాలుసాధించిందో తెలిసిందే.
`కంత్రీ` పరాజయంతో తారక్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయినా మెహర్ పై నమ్మకాన్ని తారక్ కోల్పేలేదు. అందుకే రెండవ సారి మళ్లీ `శక్తి` సినిమాకి పనిచేసే అవకాశం కల్పించారు. అది భారీ అంచనాల మధ్య తెరకెక్కించి రిలీజ్ చేసారు. `కంత్రి` పోయినా శక్తి బాక్సాఫీస్ని షేక్ చేస్తుందన్నది ఎన్టీఆర్ నమ్మకం. కానీ అది ఒమ్మైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఘోర పరాజయం చెందింది.
ఇలా రెండు సార్లు తారక్ అవకాశం ఇవ్వడానికి బలమైన కారణం ఒక్కటే. అదే మెహర్ లో గొప్ప లక్షణం. ఎలాంటి హీరోకైనా స్టోరీ నరేషన్ తోనే కళ్ల ముందు సినిమా చూపిస్తాడు. విజువల్ గా సినిమా హైలైట్ చేయగల ఏకైక దర్శకుడిగా అతనికి మంచి పేరుంది. అతని పరిచయస్తులంతా మెహర్ కి అవకాశాలు వస్తున్నాయంటే తనలో ఆ రేర్ క్వాలిటీనే అలా తీసుకెళ్తుందని చెబుతుంటారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవితో అవకాశం అందుకోవడానికి అదే కారణంగా అన్నది చాలా మంది అభిప్రాయం. బోళా శంకర్ తమిళ సినిమాకి రీమేక్ రూపం అయినా....చిరంజీవిని విజువల్ గా హైలైట్ చేసి లాక్ చేసినట్లు చెబుతుంటారు. దానికి తోడు చిరంజీవితో బంధుత్వం కూడా అవకాశానికి మరో కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనా వరుస పరజయాల ట్రాక్ ఉన్న రమేష్‌కి మెగాస్టార్ అవకాశం కల్పించడం అన్నది గొప్ప విషయం. ఆయన నమ్మకాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది.
మరి తాజాగా మెహర్ రమేష్ మరోసారి యంగ్ టైగర్ ని కెలుకుతున్నాడా? మెగా ఛాన్స్ నేపథ్యంలో తారక్ కూడా మళ్లీ అవకాశం కల్పిస్తాడని మరో రాయి వేస్తున్నాడా? అంటే అవుననే గుసగుస వినిపిస్తుంది. టైగర్ కి స్టోరీ చెప్పాలని ట్రై చేస్తున్నట్లు తెలిసింది. తారక్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ భారీ యాక్షన కథని సిద్దం చేసినట్లు సమాచారం.
కొరటాల శివ ప్రాజెక్ట్ డిలే అవుతోన్న నేపథ్యంలో ఈలోగా స్టోరీతో తారక్ ని లాక్ చేయాలన్నది మెహర్ ప్లాన్ గా కనిపించింది. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. తారక్ అవకాశం ఇవ్వడం అంత ఈజీ కాదన్నది కొందరి వాదన. అలాగే కొరటాల సినిమా కూడా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పూర్తయ్యే వరకూ తారక్ కొత్త ప్రాజెక్ట్ ల జోలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.