పంజాబీ బ్యూటీ కంటిన్యూ చేస్తుందా?

Update: 2019-09-29 07:26 GMT
ఈ ఏడాది'F2'తో మంచి సక్సెస్ అందుకుంది మెహ్రీన్. వెంకీ -వరుణ్ ల తర్వాత తన కామెడీతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ సినిమా సక్సెస్ తో తెలుగులో వరుసగా మూడు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పంజాబీ బ్యుటి హీరోయిన్ గా నటించిన చాణక్య రిలీజ్ కి రెడీ అవుతుంది. అక్టోబర్ 5 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది మెహ్రీన్. సినిమాలో తన క్యారెక్టర్ కొంచెం ఫన్నీ గా ఉంటుందని తన పాత్ర ద్వారానే ఫన్ జెనరేట్ అవుతుందని చెప్పుకొంటుంది కూడా.

పంజాబీలో రెండు సినిమాలు చేస్తున్న మెహ్రీన్ ప్రస్తుతానికి తెలుగు సినిమాల మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో లక్కీ క్వీన్ అనిపించుకోవాలని చూస్తుంది. ఆ దిశగానే వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది. మినిమం రేంజ్ ఉన్న హీరోలతోనే సినిమాలు ఒప్పుకుంటుంది కూడా.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో 'ఎంత మంచివాడవురా' - నాగ శౌర్యతో 'అశ్వద్దామ' సినిమాలు చేస్తున్న మెహ్రీన్ ఈ సినిమాలతో కూడా వరుస సక్సెస్ లు అందుకుంటాననే ధీమా వ్యక్తం చేస్తుంది.

ఈ రెండు సినిమాల్లో మెహ్రీన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే టాక్ వినిపిస్తుంది. కేవలం గ్లామర్ రోల్సే అని అంటున్నారు. నిజానికి F2లో అమ్మడికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. డానికి న్యాయం చేసింది కూడా. మరి ఇప్పుడు  ఈ గ్లామర్ రోల్స్ తో మెహ్రీన్ నెట్టుకొస్తుందా ...ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తుందా చూడాలి.


Tags:    

Similar News