ఇంటిమేట్ సీన్స్ చేయనంటున్న సొగసరి!

Update: 2021-12-23 03:56 GMT
తమన్నా తరువాత ఆ రేంజ్ కలర్ తో కనువిందు చేసేవారే లేరా? తమన్నా తరువాత వెండితెర వెలవెల బోవలసిందేనా? అని కుర్రాళ్లంతా బెంగపెట్టేసుకుంటూ ఉండగా, 'కంగారు పడకండి నేనున్నాగా' అంటూ రంగంలోకి దిగిన కథానాయికనే మెహ్రీన్. అప్పుడే పాకంలో ముంచి తీసిన జిలేబీలా పిల్లా అందంగా ఉందని కుర్రాళ్లంతా సంబరపడిపోయారు. వాళ్లు అనుకున్నట్టుగానే .. ఆశించినట్టుగానే మెహ్రీన్ గ్లామరస్ పాత్రలను చేస్తూ వెళ్లింది. ఇక 'ఎఫ్ 2' సినిమా చూసిన తరువాత నిజంగానే ఆమె తెలుగు తెరపై తేనె సంతకమేనని అనుకున్నారు. ఇక ఈ బ్యూటీ జోరు కొనసాగడం ఖాయమని ఫిక్స్ అయ్యారు.

క్రేజ్ ఉండగానే మరికొన్ని సినిమాలు చేయాలనే ఒక సిద్ధాంతాన్ని ఈ సొగసరి లైట్ తీసుకుని పెళ్లి వైపు అడుగులు వేసింది. ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా అని కొత్త ప్రాజెక్టులపై పెద్దగా ఆసక్తిని చూపలేదు. దాంతో కొత్తగా వచ్చిన అమ్మాయిలకు అవి వెళ్లిపోయాయి. ఇటు చూస్తే కొన్ని కారణాల వలన పెళ్లి ఆగిపోయింది. కారణం ఏదైనా ఆ బాధ నుంచి కోలుకోవడానికి మెహ్రీన్ కి కాస్త సమయం పట్టేలానే అనిపిస్తోంది. అందువల్లనే ఈ మధ్య మరీ బక్కచిక్కి పోతోంది. మెహ్రీన్ మళ్లీ తెరపై పాలపిట్టలా ఎగరాలనే అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంతగా ఎక్కువ సినిమాలతో తాను బిజీగా ఉండాలనే ఉద్దేశంతో మెహ్రీన్ ముందుకు వెళుతోంది. తనకి గల క్రేజ్ కి తక్కువే అయినా 'మంచి రోజులు వచ్చాయి' సినిమాను చేసింది. కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇదివరకటి కంటే ఇప్పుడు ఆమెలో ఎక్కువ కసి కనిపిస్తోంది. కెరియర్ ను గాడిలో పెట్టుకోవాలనే ఆరాటం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ఆమెకి ఒక సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అయితే ఆ కథ వినేసిన ఆమె తాను చేయనని నిర్మొహమాటంగా చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి కథలతో తనని కలవడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెప్పిందట.

ఆ కథలో ఆమె చాలా బోల్డ్ గా కనిపించవలసి ఉంటుందనీ, అక్కడక్కడా బెడ్ రూమ్ సీన్స్ .. కిస్ సీన్స్ వస్తూనే ఉంటాయని చెప్పారట. గ్లామరస్ గా కనిపించడానికి .. బోల్డ్ గా కనిపించడానికి మధ్య గల తేడా తనకి తెలుసనీ, అలాంటి పాత్రలు తాను చేయనని మెహ్రీన్ చెప్పేసిందట. బోల్డ్ సీన్స్ చేయడం వలన వచ్చే ఫేమ్ తనకి అవసరం లేదనేది ఆమె చెబుతున్నమాట. మొత్తానికి మెహ్రీన్ తన కెరియర్ విషయంలో పూర్తి క్లారిటీతోనే ఉందన్న మాట. ప్రస్తుతం ఆమె తాజా చిత్రంగా 'ఎఫ్ 3' రూపొందుతోంది. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆమె మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ లోగా ఆమె కాస్త కండపట్టాలంతే.
Tags:    

Similar News