70 లక్షలు డిమాండ్ చేసిందా?

Update: 2018-07-01 07:27 GMT
ఒక హీరోయిన్ తొలి సినిమా విజయవంతం అయితే ఆటోమేటిగ్గా పారితోషకం పెరిగిపోతోంది. అందులోనూ వరుసగా మూడు సినిమాలు హిట్టయితే ఇక చెప్పేదేముంది? గోల్డెన్ లెగ్ అన్న ట్యాగ్ వచ్చేస్తుంది. రెమ్యూనరేషన్ కొండెక్కేస్తుంది. మెహ్రీన్ కౌర్ విషయంలోనూ ఇలాగే జరుగుతున్నట్లు సమాచారం. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.. ‘మహానుభావుడు’.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన మెహ్రీన్.. తన కొత్త సినిమాకు రూ.70 లక్షల పారితోషకం డిమాండ్ చేసినట్లు సమాచారం.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ తీయబోయే సినిమాకు మెహ్రీన్ ను కథానాయికగా ఎంచుకున్నారట. ఈ చిత్రాన్ని స్వయంగా కళ్యాణ్ రామే నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి మెహ్రీన్ రూ.70 లక్షల పారితోషకం అడగడంతో కళ్యాణ్ రామ్ డైలమాలో పడ్డాడట. ప్రస్తుతం పారితోషకం విషయంలో చర్చలు నడుస్తున్నాయట. మెహ్రీన్ కొంచెం తగ్గే అవకాశాలున్నాయి.

మూడు వరుస హిట్లతో గత ఏడాది మెహ్రీన్ మంచి ఊపు మీద కనిపించింది. అప్పుడే అయితే రూ.70 లక్షలు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేకపోయేదేమో. కానీ హ్యాట్రిక్ హిట్ల తర్వాత ఆమె కెరీర్ గాడి తప్పింది. ‘కేరాఫ్ సూర్య’.. ‘జవాన్’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘పంతం’ మీదే ఉన్నాయి. అది హిట్టయితే కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని ఆమె ఆశిస్తోంది. కళ్యాణ్ రామ్ సినిమాకు రూ.50 లక్షలకు అటు ఇటుగా రెమ్యూనరేషన్ ఫిక్స్ కావచ్చని భావిస్తున్నారు.
Tags:    

Similar News