ఫోటోటాక్ : జూ. మిల్కీ బ్యూటీ మరింత మెరిసి పోతుందే!

Update: 2022-10-30 14:30 GMT
సినిమా ఇండస్ట్రీ లో మిల్కీ బ్యూటీ అనే పేరు తమన్నాకు బాగా సెట్‌ అవుతుంది. నిజంగా మిల్క్‌ తో తయారు చేసిన ఒక బొమ్మ అన్నట్లుగా తమన్నా ఉంటుందని అభిమానులు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. తమన్నా తర్వాత అలాంటి స్కిన్ టోన్ ఉన్న ముద్దుగుమ్మ మెహ్రీన్‌ అనడంలో సందేహం లేదు.

జూనియర్‌ మిల్కీ బ్యూటీ అంటూ మెహ్రీన్‌ ను అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ఆ ట్యాగ్‌ మరియు ఆమె అందం వల్ల ఇండస్ట్రీ లో చాలా రోజులుగా సక్సెస్‌ లు లేకున్నా కొనసాగుతూ వస్తుంది. అందంతో పాటు నటన విషయంలో మంచి ప్రతిభ ఉన్నా కూడా పాపం మెహ్రీన్ కి అదృష్టం కలిసి రావడం లేదు.

అందంగా కనిపించడం తో పాటు అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా ముందు ఉండే ముద్దుగుమ్మ మెహ్రీన్‌ ఇన్‌ స్టా లో రెగ్యులర్ గా అందాలను ఆరబోస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేయడం జరిగింది.

అందాల మెహ్రీన్‌ మరింత అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయినా కూడా మొదటి సినిమాలో ఎలా అయితే కనిపించిందో ఇప్పుడు కూడా అదే అందంతో అంతే ఫ్రెష్ గా మెహ్రీన్‌ కనిపిస్తుందని అంటున్నారు.

ఇంత అందంగా ఉన్న ముద్దుగుమ్మ మెహ్రీన్ ను ఫిల్మ్‌ మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈమె చాలా హోప్స్ పెట్టుకుని నటించిన ఎఫ్‌ 3 సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పర్చింది. దాంతో ఈమె తదుపరి సినిమా ఆఫర్స్ కష్టంగా మారాయి. ఇదే తరహాలో ఫోటో షూట్స్ తో రెచ్చి పోతూ ఉంటే తప్పకుండా మళ్లీ తెలుగు లో బిజీ అవుతారు అంటూ మెహ్రీన్‌ కి అభిమానులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News