కరోనాకు ముందు నుండే నేను ఇలా అంటోంది

Update: 2021-11-06 06:30 GMT
గత ఏడాది నుండి ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే మాస్క్ ను ధరించడం.. ఖచ్చితంగా శానిటైజర్స్ ను వినియోగించడం చేస్తున్నారు. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఆ డ్రస్ ను విప్పి పరిశుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాతే ఏమైనా పనులు చేస్తున్నారు. ఈ మార్పుకు కారణం కరోనా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా భయంతో ఎప్పుడు లేని కొత్త అలవాట్లను అంతా అలవాటు చేస్తున్నారు. ఈమద్య కాస్త తగ్గించారేమో కాని గత ఏడాది మార్చి నుండి ఈ ఏడాది జూన్ జులై వరకు ప్రతి ఒక్కరి చేతిలో కూడా శానిటైజర్స్ మరియు మాస్క్ లు తప్పనిసరిగా ఉండేవి. ఇప్పుడు అందరు మాస్క్ లు శానిటైజర్స్ వాడుతున్నారు కాని కరోనాకు ముందు కూడా కొద్ది మంది శానిటైజర్స్ మాస్క్ లు వాడిన దాఖలాలు ఉన్నాయి. ఆ కొద్ది మందిలో నేను ఉంటాను అంటోంది ముద్దుగుమ్మ మెహ్రీన్‌.

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఉంది. ఇటీవలే ఈమె మంచి రోజులు వచ్చాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అందులో ఈ అమ్మడి అందాల వింధుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కరోనా నేపథ్యంలో సినిమాలు కాస్త తగ్గినా కూడా అంది వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో తన ఓసీడీ గురించి చెప్పుకొచ్చింది. మారుతి దర్శకత్వంలో ఈమె నటించిన మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్‌ కు ఓసీడీ ఉంటుంది. ఆ ఓసీడీతో ఆమెకు శర్వా చిరాకు పెట్టిస్తాడు. ఆ హీరో అంత కాకున్నా తనకు కూడా కాస్త ఎక్కువ ఓసీడీనే ఉందని మెహ్రీన్‌ చెప్పుకొచ్చింది.

కరోనా వచ్చిన తర్వాత అందరు కూడా మాస్క్‌ లు ధరించి.. శానిటైజర్స్‌ ను వాడుతున్నారు. కాని నేను మాత్రం కరోనాకు ముందు నుండే నా బ్యాగ్‌ లో ఎప్పుడు శానిటైజర్‌ బాటిల్స్ ను ఉంచుకునేదాన్ని. ఇక బయటకు వెళ్లిన సమయంలో కచ్చితంగా ఫేస్ మరియు జుట్టు కవర్ అయ్యేలా ముసుగు ధరించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. నా మేకప్ మెన్.. ఇతర అసిస్టెంట్స్ ఎవరైనా కూడా నాకు దగ్గరకు రావాలంటే చేతిలో శానిటైజర్ వేసుకుని హ్యాండ్‌ వాష్ చేసుకున్న తర్వాతే రావాలి అంటుందట. నాకు నేను చాలా పరిశుభ్రంగా ఉంటాను. నా చుట్టు ఉన్న పరిసరాలు కూడా ఖచ్చితంగా శుభ్రంగా నీట్ గా ఉండేలా చూసుకుంటాను. ఒక చోట ఉండాల్సిన వస్తువులు అదే చోట ఉండాలి. దాన్ని ఎవరైనా మార్చితే నాకు కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తాను అంది. మొత్తానికి ఈమె రియల్‌ లైఫ్‌ మహానుభావురాలు అన్నమాట.




Tags:    

Similar News