2017లో కుమ్మేస్తానంటున్న భామ

Update: 2017-01-05 07:48 GMT
కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలు పెట్టుకుని కొత్తగా ఏదేదో చేసేస్తామని ఎక్కువమందే చెబుతుంటారు కానీ.. వాస్తవంలో ఇలాంటి అవకాశం చాలా కొద్ది మందికే ఉంటుంది. సౌత్ లో కుదురుకుని.. నార్త్ లో ట్రై చేసే హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకా అరంగేట్రం చేస్తూనే.. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ పట్టేసిన బ్యూటీ మెహ్రీన్ కౌర్ పీర్జాడా. అందుకే 2017 నేను ఇరగదీయడం ఖాయం అంత నమ్మకంగా చెబుతోంది.

కృష్ణగాడి వీర ప్రేమ గాధ మూవీతో పరిచయం అయిన మెహ్రీన్ చేతిలో.. ఇప్పుడు ఏకంగా 7 ప్రాజెక్టులు ఉన్నాయి. టాలీవుడ్.. కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి చక్కర్లు కొట్టేస్తూ చకచకా సినిమాలు కానిచ్చేస్తోంది. బాలీవుడ్ క్రేజీ మూవీ ఫిలౌరీలో ఓ హీరోయిన్ గా నటించేస్తుండడం విశేషం. పంజాబి అమ్మాయిగా ఈ మూవీలో తాను పోషించే రోల్.. బాలీవుడ్ లో తనకు పర్మనెంట్ ప్లేస్ ను తెచ్చిపెడుతుందని అమ్మడు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇక తెలుగు తమిళ్ లో కూడా ఈమె చేస్తున్న సినిమాల స్థాయి తక్కువేమీ కాదు.

వరుణ్ తేజ్.. సాయిధరం తేజ్.. శర్వానంద్.. సందీప్ కిషన్.. ఇలా వరుసగా కుర్ర హీరోలతో పాటు మాస్ మహరాజ్ రవితేజ పక్కన కూడా ఛాన్స్ పట్టేసింది. సందీప్ కిషన్ తో చేస్తున్న బై లింగ్యువల్ మూవీతో కోలీవుడ్ అరంగేట్రం కూడా చేసేయనుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే మూడు ఇండస్ట్రీల మధ్య చక్కర్లు కొట్టేసే ఛాన్స్ రావడం తన అదృష్టం ప్లస్ ట్యాలెంట్ అని నమ్మకంగా చెబుతోంది మెహ్రీన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News