గత ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘పెళ్లిచూపులు’. అప్పటికి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ - రీతు వర్మలను హీరో హీరోయిన్లుగా పెట్టి కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక రిఫ్రెషింగ్ మూవీని అందించాడు. ఆ సినిమాలో కంటెంట్ ఉందని గుర్తించి సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్.. ఈ చిత్రాన్ని తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. ఆ చిత్రానికి విడుదలకు ముందు ప్రచారం బాగా చేసి.. ముందే సినిమా వాళ్లకు.. ప్రెస్ వాళ్లకు ప్రివ్యూ వేసి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చూశాడు సురేష్.
ఇప్పుడు సురేష్ ఇదే తరహాలో ‘మెంటల్ మదిలో’ అనే సినిమాను టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశాడు. విశేషం ఏంటంటే.. ‘పెళ్లిచూపులు’ తరహాలోనే దీనికి కూడా రిలీజ్ కంటే ముందు పాజిటివ్ టాక్ వచ్చేస్తోంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఈ చిత్రానికి వరుస బెట్టి ప్రివ్యూలు వేస్తున్నారు. కొన్ని రోజులుగా టాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా దీనికి రివ్యూలిస్తున్నారు. అందరూ ఈ చిత్రాన్ని పొగిడేస్తున్న వాళ్లే. యువ కథానాయకుడు రామ్ కూడా అందులో ఒకడు. ప్రెస్ వాళ్లకు కూడా రెండు రోజుల ముందే ప్రివ్యూ వేస్తారట. మొత్తానికి ‘పెళ్లిచూపులు’ తరహాలోనే ముందే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి మంచి బజ్ మధ్య రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో ఎంతమేరకు విజయవంతమవుతారో.. ‘పెళ్లి చూపులు’ మ్యాజిక్ ను ‘మెంటల్ మదిలో’ ఏమాత్రం రిపీట్ చేస్తుందో చూడాలి.