తమిళనాట ఎన్నో ఏళ్లుగా రూ. 5 లకే వైధ్యం అందిస్తున్న డాక్టర్ తిరువేంకటం అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన మెర్సల్ చిత్రం తెలుగులో అదిరిందిగా డబ్ అయ్యింది. ఆ సినిమాలో ఒక పాత్ర కేవలం 5 రూపాయలకే వైధ్యం అందిస్తూ ఉంటుంది. ఆ పాత్రకు ఇన్సిపిరేషన్ తిరువేంకటం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆ సమయంలోనే ప్రకటించారు. దాంతో డాక్టర్ తిరువేంకటంకు బాగా గుర్తింపు వచ్చింది.
ఇటీవల ఆయన ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన రెండు రోజుల చికిత్స అనంతరం కోలుకున్నట్లుగా వైధ్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లుగా వైధ్యులు ప్రకటించారు. తిరువేంకటంకు ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా వైధ్య వృత్తిలోనే ఉన్నారు. ఆయన తన విధి నిర్వహణలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.
1973 నుండి నార్త్ చెన్నైలోని వ్యాసరపడిలో ఈయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పటి నుండి ఎప్పుడు కూడా సెలవు తీసుకోక పోవడంతో పాటు ఫీజు పేరుతో జనాలను ఇబ్బంది పెట్టలేదు. అందుకే ఆ చట్టు పక్కల వారికి ఆయన ఒక దేవుడుగా మారిపోయాడు. అందుకే ఆయన మృతి చెందిన వార్త స్థానికులను శోకంలోకి నెట్టి వేసింది. ఆయన మృతిపై తమిళనాడు ముఖ్యమంత్రి నుండి మొదలుకుని కోలీవుడ్ స్టార్స్ వరకు ఎంతో మంది శ్రద్దాంజలి ఘటించారు.