బ్యూటిఫుల్ మెలోడీతో మెస్మ‌రైజ్ చేస్తున్నారు!

Update: 2022-07-04 09:00 GMT
దుల్క‌ర్ స‌ల్మాన్ విభిన్న‌మైన చిత్రాల‌తో మ‌ళ‌యాల ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు, త‌మిళ ఆడియ‌న్స్ ని కూడా మెస్మ‌రైజ్ చేస్తున్నారు. 'మ‌హాన‌టి'తో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నఆయన మ‌రోసారి తెలుగులో న‌టిస్తున్న చిత్రం 'సీతారామం'. 'యుద్దంతో రాసిన ప్రేమ‌క‌థ' అని ట్యాగ్ లైన్‌. హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌బోతోంది. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ పై వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో  సి. అశ్వ‌నీ ద‌త్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, టీజ‌ర్ ల‌తో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాళ్ ఠాకూర్ త‌మ‌దైన కెమిస్ట్రీతో ఆక‌ట్టుకున్నారు. ముస్లీం యువ‌తిగా ర‌ష్మీక క‌నిపించిన విజువ‌ల్స్‌.. దుల్క‌ర్‌, మృణాల్ మ‌ధ్య సాగే ల‌వ్ స్టోరీ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఆగ‌స్టు 5న ఈ మూవీ భారీ స్థాయిలో మూడు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేశారు.

ఇటీవ‌లే టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్ర బృందం ఫ‌స్ట్ సింగ్ తో మ‌రింత‌గా అంచ‌నాల్ని పెంచేసింది. తాజాగా సోమ‌వారం ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా 'ఇంతందం దారి మ‌ళ్లిందా..' అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.

కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించిన ఈ మెలోడీకి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందించారు. ఎస్. పి. బి. చ‌ర‌ణ్ ఆల‌పించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్ సాంగ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

తాజాగా విడుద‌ల చేసిన మెలోడీ కూడా మెస్మ‌రైజ్ చేస్తోంది. కృష్ణ‌కాంత్ సాహిత్యం, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం , ఎస్. పి. బి.  చ‌ర‌ణ్ గానం వెర‌సి ఈ సాంగ్ అద్భుతమైన మెలోడీగా ఆక‌ట్టుకుంటోంది. హీరోయిన్ మృణాళ్ ఈ పాట‌లో చాలా అందంగా గార్జియ‌స్ గా క‌నిపిస్తోంది. పీఎస్ వినోద్ ఫోటోగ్ర‌ఫీ కూడా ఈ పాట‌కు మ‌రింత ఎస్సెట్ గా మారి వ‌న్నె తెచ్చింది. మెలోడీ ప్ర‌ధానంగా సాగిన ఈ సాంగ్ య‌ద‌లోతుల్లోకి చేరి ఊయ‌ల‌లూగిస్తోంది.

ఆగ‌స్టు 5న భారీ స్థాయిలో తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో భారీ స్థాయిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీలో హీరో సుమంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌కాష్‌రాజ్‌, గౌత‌మ్ మీన‌న్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, కెమెరా పీఎస్ వినోద్ , శ్రేయాస్ కృష్ణ‌, ఎడిటింగ్ కొట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు.



Full View
Tags:    

Similar News