సినీ పరిశ్రమ ఎంతో సున్నితమైనది. ఇక్కడ ఒకసారి ఏదైనా ఒకరిపై నెగెటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఎంత పెద్ద ఆర్టిస్టు అయినా పక్కన పెట్టేస్తుంటారు. క్యారెక్టర్ లాస్ అయినా.. షార్ట్ టెంపర్ చూపించినా.. సమయపాలన లేకుండా ఉన్నా.. లేడీ ఆర్టిస్టుల విషయంలో తేడాగా కనిపించినా ఇక ఆ ఆర్టిస్టు పని అంతే. అదొక్కటే కాదు.. ఎవరైనా ఆర్టిస్టు వల్ల షూటింగ్ ఏమాత్రం డిస్ట్రబ్ అయినా అతడికి మరో అవకాశం ఇవ్వడం చాలా కష్టం!! ఒకరి వల్ల రోజంతా షూటింగ్ నష్టపోవాల్సిన సన్నివేశం దాపురిస్తుంది. ఈ విషయంలో ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు చాలా అలెర్టుగా ఉంటున్నారన్నది ఓ సీనియర్ విశ్లేషణ. ఒదిగి ఉంటేనే పరిశ్రమలో అవకాశాలుంటాయి. అది ఆర్టిస్టులు అయినా.. లేదా ఇతర శాఖల్లో అయినా. చివరికి అసిస్టెంట్ డైరెక్టర్లు సైతం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ఇటీవల కొందరు సీనియర్ ఆర్టిస్టులు.. సీనియర్ కమెడియన్లకు అసలు అవకాశాలు రాలేదన్న ప్రచారం సాగింది. అయితే వాళ్లను మన దర్శక నిర్మాతలు ఎందుకు పక్కన బెడుతున్నారు? అని ప్రశ్నిస్తే ఓ ఆర్టిస్టు చెప్పిన ఆన్సర్ షాకిచ్చింది. సీనియర్ అన్న తలబిరుసు చూపించడమే అందుకు కారణం. అలాంటి సీనియర్లతో సింక్ అవ్వడం నవతరం దర్శకులకు తలనొప్పి వ్యవహారం. అందుకే స్క్రిప్టు రాసేప్పుడే అలా వ్యవహరించే వాళ్లను అస్సలు టచ్ చేయకుండా రాసుకుంటున్నారు. పైగా సీనియర్లకు పారితోషికాలు పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు వాళ్ల నస ఓపిగ్గా భరించాల్సి ఉంటుంది. అందువల్ల అలాంటి వాళ్లను తీసుకునే కంటే అప్పుడే లైమ్ లైట్ లోకి వచ్చే వేరొక కమెడియన్ వైపు లేదా వేరొక క్యారెక్టర్ ఆర్టిస్టు వైపు దర్శకనిర్మాతలు చూస్తుంటారట. అలా జబర్ధస్త్ లాంటి షోల్లో పాపులరైన ఆర్టిస్టులకు విరివిగానే అవకాశాలు దొరుకుతున్నాయని ఓ పెద్దాయన `తుపాకి`తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలిపారు.
మీటూ ఉద్యమం.. కాష్ కమిటీ వంటి వాటి ప్రభావం టాలీవుడ్ పై ఎంతవరకూ ఉంది? అని ప్రశ్నిస్తే .. ఇవన్నీ ముందు హడావుడి చేసి తర్వాత ఎవరి పనిలో వాళ్లు పడిపోతారు. ఏదైనా `వివాదం` బయటికి వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు నిద్ర లేస్తారంతే. అప్పటివరకూ యథారాజా .. తదా ప్రజ! అన్న చందంగానే ఇండస్ట్రీ దాని గోలలో అది పడి ఉంటుంది. వేధించారు అని కమిటీల్ని సంప్రదిస్తేనే అప్పుడు యాక్టివ్ అవుతారు. ముందే దానిపై కంట్రోల్ చేయడం అనేది ఉండదు. అలా ఎవరూ చేయలేరు..!! అని అన్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఆర్టిస్టు మీటూ.. కాష్ కమిటీ అంటూ నానా యాగీ చేస్తే ఆ తర్వాత మళ్లీ ఆ ఆర్టిస్టు వైపు ఎవరైనా చూస్తారా? ఇలా పరువు తీసి పందిరి వేసే వాళ్లతో ఏ చిన్న ఇష్యూ వచ్చినా పబ్లిక్ లో రచ్చవుతుంది. పరువు తీస్తే తిరిగి ఎవరిస్తారు ఛాన్సులు? ఆ ఆర్టిస్టు పేరు ఇండస్ట్రీ అంతటా రిజిస్టర్ అయిపోతుంది. ఆటోమెటిగ్గా ఇక కెరీర్ జీరో అయిపోయినట్టేనని తెలిపారు. నాణేనికి బొమ్మ - బొరుసు ఉన్నట్టే ప్రతి చిన్నదానికి కంప్లైంట్లు ఇస్తూ పోతే అదో ప్రమాదంగానూ మారే వీలుంది. అలా అని వేధింపులు భరించాలా? అంటే కచ్ఛితంగా ఇన్నర్ గా పెద్దలతో మాట్లాడి బయట గోల అవ్వకుండా పరిష్కరించుకోవడం తెలివైన పని అనిపించుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే కొన్ని బ్యానర్లలో మాత్రం ముందే లైంగిక వేధింపుల విషయంలో లొకేషన్ లో పని చేసే అందరికీ సీరియస్ గానే వార్నింగులు షురూ చేస్తున్నారట. అలాంటి వివాదాల జోలికి అసలే వెళ్లొద్దని చెప్పేస్తున్నారట. దీంతో లొకేషన్ లో వాతావరణం కాస్త వేడిగానే ఉంటోందని చెబుతున్నారు. ముఖ్యంగా నటి శ్రీరెడ్డి ఉదంతం తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన తాజా మార్పు ఏంటి? అని ప్రశ్నిస్తే.. దానివల్ల చాలా వరకూ జాగ్రత్త పడ్డారనే ఓ ఆర్టిస్టు నుంచి ఆన్సర్ వచ్చింది.