మీటూ ఉద్యమంలో భాగంగా తనకు జరిగిన అన్యాయంను మీడియా ముందు చెప్పినందుకు నా కెరీర్ ను నాశనం చేశాడంటూ కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ మరోసారి అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. విస్మయ సినిమా సమయంలో ఆయన నన్ను లైంగికంగా వేదించాడని ఉన్న విషయం చెప్పడం వల్ల నా కెరీర్ నాశనం అయ్యిందని శృతి తాజాగా ఒక మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం వరకు నన్ను పలువురు దర్శకులు సినిమాల్లో నటించాల్సిందిగా అడిగేవారు. కాని రెండు నెలల క్రితం నేను అర్జున్ పై చేసిన వ్యాఖ్యల తర్వాత ఇప్పటి వరకు నన్ను ఒక్క నిర్మాత కూడా సంప్రదించలేదు.
కన్నడ సినీ పరిశ్రమలో తనకున్న పలుకుబడితో అర్జున్ నిర్మాతలతో మాట్లాడి నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు, ఆయనకు భయపడి ఏ ఒక్క నిర్మాత కూడా నన్ను పరిగణలోకి తీసుకోవడం లేదని శృతి ఆవేదన వ్యక్తం చేసింది. ఏ నిర్మాత అయినా నన్ను తీసుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాడనే ఉద్దేశ్యంతో నన్ను ఇప్పటి వరకు ఎవరు కూడా సినిమాల్లోకి తీసుకునే సాహసం చేయడం లేదని చెప్పుకొచ్చింది.
నాకు అవకాశాలు రాకుండా ఆయనే చేస్తున్నాడని శృతి గట్టిగా చెబుతుంది. అయితే అర్జున్ తో సున్నం పెట్టుకోవడం ఎందుకనే పలువురు నిర్మాతలు ఆమెకు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద హీరోయిన్ అంటూ ఆమె పై ముద్ర పడినది. దాంతో ఆమె తో వర్క్ చేయడం వల్ల సినిమా విడుదల సమయంలో అయినా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఏ నిర్మాత కూడా ఆమెను సంప్రదించడం లేదు. అర్జున్ పై ఆరోపణలు చేయడంతో ఆమె కెరీర్ అర్థాంతరంగా ముగిసినట్లే అంటూ కన్నడ సినీ వర్గాల వారు అంటున్నారు.