ఇప్పుడు యువి నిర్మాతలతో పాటు యావత్ ప్రభాస్ ఫ్యాన్స్ లేట్ నైట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనే దాని గురించి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నిన్న సోషల్ మీడియాలో సంస్థ ప్రతినిధులు పెట్టిన అప్లికేషన్ గా చెలామణిలో ఉన్న ఓ లెటర్ వైరల్ చక్కర్లు కొట్టేసింది. దాంట్లో ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 5 దాకా రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల లోపు రెండు అదనపు షోలు వేసుకునేందుకు ఆంధ్ర మొత్తం అనుమతులు ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొన్నారు.
మొదటి రోజు బెనిఫిట్ షోలు కాబట్టి ఎంత లేట్ నైట్ అయినా జనం సినిమాను చూస్తారు. కానీ అదే స్థాయి యాంగ్జైటి మరుసటి రోజు నుంచి ఉంటుందా అనేదే ఇక్కడ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అంత ఆలస్యంగా జనం సినిమా చూస్తారా అనేదే అందరిలోనూ రేగుతున్న సందేహం.. నిర్మాతల ఆలోచన ఇక్కడ మరోలా కనిపిస్తోంది. విడుదలవుతున్న 30వ తేదీకి ఎలాంటి ఇబ్బంది లేదు. మరుసటి రోజు శనివారం. అధిక శాతం ఉద్యోగులకు సెలవు దినం. ఆ తర్వాత సండే కాబట్టి ఎంత టైం అయినా లెక్క చేయకుండా సాహో చూసే ఛాన్స్ ఉంది.
ఆపై ఆదివారం రాత్రిళ్ళు కూడా ఇదే రష్ ఆశిస్తున్నారు. ఎలాగూ సోమవారం వినాయక చవితి నేషనల్ హాలిడే. కాబట్టి జాగారం చేసి సినిమా చూసినా ఉదయాన్నే ఎంత లేట్ అయినా లేవోచ్చు ఇంట్లో పూజలు చేసే టార్గెట్లు ఏమి లేకపోతే. ఈ లెక్కన నాలుగు రోజులు లేట్ నైట్స్ సాహోకు అనుకూలంగా మారతాయని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇలా సెప్టెంబర్ 2 దాకా జరిగినా చాలు నైట్ షోల రెవిన్యూ భారీగా ఉంటుంది. ఆపై 3వ తేది నుంచి రాత్రి 1 గంట షోలు వేయాలా వద్దా అనేది సదరు థియేటర్ యాజమాన్యాలు రష్ ని బట్టి నిర్ణయించుకుంటాయి. ఏదేమైనా ఈ సస్పెన్స్ కు ఇవాళ లేదా రేపు ఎండ్ కార్డు పడవచ్చు