అమెరికా అడవుల్లో కారు చిచ్చు కామన్ గానే ఉంటుంది. ఈసారి సౌత్ కాలిఫోర్నియా అడవుల్లో రేగిన కార్చిచ్చు తీర ప్రాంతంలో ఉన్న ఇల్లను నాశనం చేసింది. దాదాపుగా 175 ఇళ్లు పూర్తిగా బుగ్గి పాలు అయినట్లుగా అధికారులు ప్రకటించారు. అగ్గికి ఆహుతి అయిన ఇళ్లలో హాలీవుడ్ స్టార్స్ ఇళ్లు కూడా ఉన్నాయట. తమ ఇళ్లు కాలిపోయాయంటూ పలువురు హాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
పాప్ సింగర్ మిల్లీ సైరస్ - గెరార్డ్ బట్లర్ - రాబిన్ థిక్స్ - లేడీ గాగా - ఓర్లాండో బ్లూమ్స్ వంటి హాలీవుడ్ స్టార్స్ ఇళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా నాశనం అయ్యాయి. బుగ్గిపాలైన తన ఇంటి గురించి మిల్లీ సైరస్ సోషల్ మీడియాలో.. నా ఇళ్లు పూర్తిగా పోయింది. అయితే అదృష్టవశాత్తు నా జంతువులు మరియు కొన్ని జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోగలిగాను. నా ఇల్లు లేకపోయినా - ఆ జ్ఞాపకాలు ఎప్పటికి ఉంటాయని పేర్కొంది. తన ఇల్లు కాలిపోవడాన్ని చూసి నా గుండె పలిగి పోయిందని గెరార్డ్ బట్లర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
హాలీవుడ్ స్టార్ రాబిన్ థిక్స్ మాట్లాడుతూ.. కార్చిచ్చు నుండి ప్రజలను కాపాడేందుకు ఫైర్ ఫైటర్స్ చాలా బాగా ఫైట్ చేశారు. వారి ఫైట్ వల్లే మేము బతికి బయట పడ్డాము. ప్రజలను, ఇళ్లను కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నం అభినందనీయం అన్నాడు. కార్చిచ్చును ఆర్పేందుకు వందలాది మంది ఫైట్ ఫైటర్స్ పాల్గొన్నారు. వారు తీసుకున్న సత్వర చర్యల వల్ల ఆస్తి నష్టం తగ్గిందని అక్కడ ప్రజలు అంటున్నారు.