మిల్కీ బ్యూటీకి తన మాతృభాష రాదంట...!

Update: 2020-05-10 02:30 GMT
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోహీరోయిన్లు తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త ఛాలెంజ్ లకు శ్రీకారం చుడుతూ కాలం వెలిబుచ్చుతున్నారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను.. ఫోటోలను.. హోమ్ వర్క్ ఔట్ వీడియోలను..టిక్ టాక్ వీడియోలను.. డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. మొత్తం మీద ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న సెలబ్రిటీలు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. కానీ కొందరు సెలబ్రెటీలు మాత్రం ఇన్ని రోజులు తమలో దాగున్న టాలెంటుని బయటపెడుతున్నారు. మరికొందరు కరోనా వల్ల కావాల్సినంత సమయం దొరకడంతో వారి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొనే పనిలో పడ్డారు. చిన్నప్పటి నుండి నేర్చుకోవాలని సమయం దొరక్క వదిలేసిన వాటిని ఇప్పుడు ఈ కరోనా హాలిడేస్ లో నేర్చుకోడానికి ట్రై చేస్తున్నారు.

అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఒక కొత్త భాష నేర్చుకునే పనిలో పడిందంట. అయితే ఆ కొత్త భాష తన మాతృ భాష 'సింధీ' నేర్చుకుంటుందట. బాంబే లో పుట్టిన మిల్కీ బ్యూటీకి తన మాతృ బాషా అయినప్పటికీ తనకు మాట్లాడటం రాదట. తెలుగు తమిళం భాషలపై పట్టు సాధించిన తమ్మూ బేబీకి తన మదర్ టంగ్ రాదంటే ఆశ్చర్యంగా ఉంది. సౌత్ ఇండియా భాషలను నేర్చుకోగలిగిన మిల్కీ బ్యూటీకి సింధి మాత్రం మాట్లాడటం రావడంలేదట. ఇక ఇప్పుడు కరోనా వల్ల కావాల్సినంత టైం దొరకడంతో ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ తనతో సింధీలోనే మాట్లాడాలని షరతు పెట్టిందట. ఈ ఏడాది పూర్తయ్యేలోపు సింధీ పైన పట్టు సాధిస్తానని ధీమాగా ఉందట తమన్నా. మొత్తం మీద ఈ కరోనా పుణ్యమా అని సెలబ్రిటీలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే కాకుండా ఇలా మిగిలిపోయిన కోర్కెలను తీర్చుకుంటున్నారన్నమాట.
Tags:    

Similar News