మిల్కీ బ్యూటీ తమన్నా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి 15 ఏళ్ళు దాటింది. అయినా ఇంకా హీరోయిన్ గా కొనసాగుతూ ఈ జెనరేషన్ హీరోయిన్లకు సవాలు విసురుతోంది. ఫేడ్ అవుట్ అయిందని వార్తలు రావడం.. అంతలోపు ఏదో ఒక హిట్ సాధించి అందరిని ఆకర్షించడం తమన్నాకు చాలా కామన్. పోయినేడాది 'ఎఫ్ 2' సూపర్ హిట్ కావడం.. 'సైరా' లో తమన్నా పాత్రకు మంచి పేరు రావడంతో ఇంకా ఫేడ్ అవుట్ కాలేదని అందరూ అంగీకరించారు.
సినిమాల తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడూ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజిలపై కూడా మెరుస్తూ ఉంటుంది. తాజాగా 'వెడ్డింగ్ వోస్' అనే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానుల తో పంచుకుంది. వెడ్డింగ్ వోస్ మార్చ్ ఎడిషన్ కోసం ఈ ఫోటో షూట్ చేసినట్టుగా వెల్లడించింది. ఈ ఫోటోలో బేబీ పింక్ కలర్ చీర.. మ్యాచింగ్ మ్యాచింగ్ అనిపించే స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి నడుము మీద ఒక చెయ్యి.. కిటికీకి మరో చేతిని ఆన్చి సూపర్ డూపర్ పోజిచ్చింది. చీరతో పాటు చేతికి ఒక తళుకుబెళుకుల ఓ జాకెట్ ను ఊరికే అలా తగిలించుకుంది. కొంచెం మేకప్ గట్టిగానే దట్టించింది. బ్లూ కలర్ నెయిల్ పాలిష్.. అదే రంగు ఐ మేకప్ తో ఓ మోడల్ తరహాలో కనిపించింది.
ఆ హెయిర్ స్టైల్.. నయాగరా ఒంపులను గుర్తు తెచ్చే స్టైల్ ను నిలుచోవడం లాంటివి చూస్తే తమన్నాను ఇంకా స్టార్ హీరోలు తమ సినిమాలకు పరిశీలించవచ్చు అనిపించక మానదు. ఇదిలా ఉంటే ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "వైట్ బార్బీ".. "ఈస్ట్ ఆర్ వెస్ట్ మిల్కీ ఈజ్ ది బెస్ట్".. "ఈ టీజింగ్ ఆపు" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక మిల్కీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే గోపిచంద్ కొత్త సినిమా 'సీటి మార్' లో నటిస్తోంది. హిందీలో 'బోలె చూడియా' లో నటిస్తోంది.