నిన్న ‘తాండవ్’.. నేడు ‘మీర్జాపూర్’.

Update: 2021-01-21 12:06 GMT
మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో 'తాండవ్' సిరీస్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా మరో వెబ్ సిరీస్.. 'మిర్జాపూర్' వంతు వచ్చింది. ఈ షో మేకర్స్ తోపాటు అమెజాన్ ప్రైమ్ సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

'మీర్జాపూర్' వెబ్ సిరీస్ లో మత, సామాజిక, ప్రాంతీయ సెంటిమెంట్లను గాయపరిచే సన్నివేశాలు, అక్రమ సంబంధాలను ప్రోత్సహించే సీన్లు ఉన్నాయని అరవింద్ చతుర్వేది అనే వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుతో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మేకర్స్ రితేష్ సిద్వానీ, ఫరా అఖ్తర్ తో బాటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ పైనా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ సిరీస్ లో యూపీ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా  సన్నివేశాలు ఉన్నాయని చతుర్వేది తన ఫిర్యాదులో పేర్కొన్నరు. కాగా.. గత ఏడాది కూడా ఈ సిరీస్  వివాదాస్పదమైంది. యూపీ అభివృద్ధిని దిగజార్చేలా ఇందులో చూపారని ఎంపీ అనుప్రియ పటేల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆమె పీఎం మోదీని ఉద్దేశించి ట్వీట్ చేయడం గమనార్హం. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠీ, శ్వేతా త్రిపాఠీ, అలీ ఫజల్, హర్షితా గౌర్ నటించారు.

కాగా.. హిందూ దేవుళ్లను కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ 'తాండవ్' సిరీస్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి డైరెక్టర్ సహా ఈ సిరీస్ యూనిట్ సభ్యులంతా బేషరతుగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News