మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో 'Mishan Impossible' ప్రారంభం..!

Update: 2020-12-12 06:11 GMT
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు ఓ వైపు స్టార్ హీరోలతో మరో వైపు యంగ్ హీరోలతో సినిమాలు తీస్తూ వస్తున్నారు. నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి లు వైవిధ్యభరితమైన సినిమాలు తీస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన ప్రొడ్యూసర్స్ ఈ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 8 చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్ జె తో ఓ సినిమా చేస్తున్నారు. ఈరోజు శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ సందీప్ రాజ్ కెమెరా స్విచ్చాన్ చేయగా.. భరత్ కమ్మ ఫస్ట్ షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

ఈ చిత్రానికి 'మిషన్ ఇంపాజిబుల్' అనే డిఫరెంట్ టైటిల్ ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ ఇంగ్లీష్ టైటిల్ లో 'SIO' లెటర్స్ కొట్టివేయబడి వాటి ప్లేస్ లో 'ha' లెటర్స్ చేర్చబడి క్రేజీ సౌండింగ్ తో పలకబడుతోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లార్డ్ రామ - లార్డ్ హనుమ - లార్డ్ శ్రీకృష్ణ గెటప్ లో ఉన్న ముగ్గురు పిల్లలు చేతిలో తుపాకీలు పట్టుకుని కనిపిస్తున్నారు. బ్యాక్ సైడ్ గోడపై వాంటెడ్ పోస్టర్ అతికించబడి, అతన్ని పట్టుకున్న వారికి 50 లక్షల రివార్డ్ అని ప్రకటించబడి ఉంది. ఈ చిత్రంలో ఈ ముగ్గురి క్యారెక్టర్స్ తో పాటు ఇద్దరు లీడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. త్వరలోనే వారి క్యారెక్టర్స్ ని కూడా రివీల్ చేయనున్నారు. 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా తిరుపతికి దగ్గరలోని ఓ గ్రామంలో జరిగే హంటింగ్ ఫిల్మ్ అని తెలుస్తోంది. 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌' సినిమాతో విమర్శకుల ప్రసంశలు పొందిన స్వరూప్.. మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా.. దీపక్ యారగర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుంచి జరగనుంది.
Tags:    

Similar News