స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కానా కష్టంగా ఉంది. ఇక రెండు సినిమాల మాట అనేది ఆ పెరుమాళ్లకే ఎరుక. హీరోలంతా మాట వరుసకూ రెండు సినిమాలు చేయాలంటారంతే. కానీ అది ప్రాక్టికల్ గా సాధ్యపడలేదు. మీడియం రేంజ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమాకి మించి రిలీజ్ చేయలేని సన్నివేశం కనిపిస్తుంది.
తాజాగా హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ మీద పడటంతో? ఆ సన్నివేశం మరింత టైట్ అవుతుంది. అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించే కథ కోసం సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ తర్వాత మేకింగ్ పరంగా పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇంకా అవసరం అనుకుంటే కథపైనే ముందే రివ్యూ..ఫీడ్ బ్యాక్ లు తీసుకుంటున్నారు.
హిట్ కంటెంట్ తోనే రావాలి! అన్న పట్టుదల హీరోల్లో బలంగా కనిపించడమే ఈ డిలేకి కారణంగా చెప్పొచ్చు. తాజాగా 2023 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు థియేటర్లో సందడి కోల్పోయినట్లే. ఇప్పటికే ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ 30వ చిత్రం 2024లోనే రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
కాబట్టి కొరాటాల-తారక్ కాంబో గురించి అప్పటివరకూ వేచి ఉండటం తప్పా చేసేది లేదు. రిలాక్స్ గా షూట్ సహా అన్ని పనులు పూర్తి చేసి కూల్ గా రిలీజ్ కి వద్దామని టైగర్ అండ్ కో వచ్చే ఏడాదికి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఇక ఐకాన్ స్టార్ కథానాయకుడిగా నటిస్తోన్న 'పుష్ప-2' ఈ ఏడాది ఎలాగూ రిలీజ్ కాదని తెలుస్తోంది.
కథ కోసమే చాలా సమయం వెచ్చించారు. పైగా అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా మలచడంతో పాటు.. సాంకేతికంగానూ సినిమాను హైలైట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారు. ఆ రకంగా టేకింగ్ కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు వినిపిస్తుంది. షూటింగ్ సహా అన్ని పనులు పూర్తవ్వడానికి ఏడాది సమయం పడుతుందంటున్నారు.
ఆ లెక్కన 'పుష్ప: దిరూల్' 2024లోనే రిలీజ్ ఖాయం చేయాలి. ఇక ఆర్ సీ 15 కూడా ఈ ఏడాది రిలీజ్ కష్టమనే టాక్ వినిపిస్తుంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుంది. అవన్నీ పూర్తవ్వడానికి డిసెంబర్ వచ్చేస్తుందని గుసగుస. అదే జరిగితే చరణ్ సినిమా వచ్చే ఏడాదే రిలీజ్ అవుతుంది. ఆ రకంగా ముగ్గురు హీరోలు 2023ని మిస్ అయినట్లే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.