ఇండియాలో రికార్డులు దున్నేస్తుందా?

Update: 2018-07-23 04:16 GMT
ఇండియా బాక్సాఫీస్‌ పై హాలీవుడ్ దాడి గురించి స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పాశ్చాత్య సినిమాలు ఊహించ‌ని రీతిలో వ‌సూళ్లు సాధిస్తూ హ‌డ‌లెత్తిస్తున్నాయి. అట్నుంచి భారీ క్రేజుతో వ‌స్తున్న ప‌లు చిత్రాలు ఇండియాలో తేలిగ్గా 300 కోట్ల వ‌సూళ్లు సాధిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఈ ఏడాది వ‌రుస బ్లాక్‌ బ‌స్ట‌ర్ల‌తో హాలీవుడ్ ఏకంగా దండ‌యాత్రే చేసింది.

రెండేళ్ల‌ క్రితం రిలీజైన జంగిల్ బుక్ (2016) అసాధార‌ణ వ‌సూళ్ల‌తో దుమ్ము రేపింది. ఈ సినిమా మ‌న దేశం నుంచి దాదాపు 300కోట్లు కొల్ల‌గొట్టింది. అటుపై అదే క్రేజుతో ప్ర‌తియేటా ప‌దుల సంఖ్య‌లో సినిమాలు రిలీజ‌వుతూ బంప‌ర్ హిట్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది బ్లాక్ పాంథ‌ర్ - జురాసిక్ వ‌ర‌ల్డ్ 2 - అవెంజర్స్ 2 - ఇన్‌ క్రెడిబుల్స్ 2 - యాంట్‌ మ్యాన్ & ది వాస్ప్ సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించాయి. మ‌న దేశ సొమ్ముల్ని విదేశాల‌కు గంప‌గుత్త‌గా ఎగ‌రేసుకుపోయాయి. ఇంత‌కాలం ఇండియాలో 3డి సినిమా విప్ల‌వం లేదు. లోక‌ల్‌ గా ఇంకా 2డి సినిమాల‌పైనే ఆధార‌ప‌డ‌డం హాలీవుడ్‌ కి ఎంత‌గానో క‌లిసొస్తోంది. అక్క‌డినుంచి వ‌చ్చే అతిభారీ సినిమాల‌న్నీ 3డి సినిమాలే కావ‌డంతో వ‌సూళ్ల మోత మోగిస్తున్నాయి. లేటెస్టుగా టామ్ క్రూజ్ న‌టించిన `మిష‌న్ ఇంపాజిబుల్ - ఫాలౌట్` రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఈనెల 27న ఈ సినిమా 2డి - 3డిలో ఇండియా బాక్సాఫీస్‌ ని దండెత్తేందుకు వ‌స్తోంది. వ‌రుస‌గా ట్రైల‌ర్‌ లు - టీజ‌ర్లు రిలీజై హ‌డ‌లెత్తిస్తున్నాయి. తాజాగా రిలీజైన‌ కొత్త టీజ‌ర్ గ్లింప్స్‌ ని యూత్ క్యాచ్ చేస్తోంది. టీజ‌ర్లు చూస్తుంటేనే మ‌తిపోతోంది. టామ్ క్రూజ్ 55వ‌య‌సులోనూ రిస్కీ ఫీట్స్‌ తో దుమ్ము దులిపేస్తున్నాడు. మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ అంటేనే యూత్‌ లో ఉండే క్రేజు వేరే కాబ‌ట్టి - అందుకు త‌గ్గ‌ట్టే ఈ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News