ఫోకస్‌: కొన్నిటికి లాజిక్కు వెతకొద్దు గురూ

Update: 2015-05-26 03:30 GMT
సినిమా అంటే ఓ తపస్సు. సినిమా మొదలెట్టి పూర్తి చేసేవారకూ సప్తసముద్రాలు దాటినంత పని. 24శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ఏ తప్పూ దొర్లకుండా జాగ్రత్తగా కాన్సన్‌ట్రేష్‌తో తీయాలి. అయితే ఇంత చేసినా విమర్శకులు ఏదో ఒక తప్పును ఎత్తి చూపుతుంటారు. అలాంటివాళ్లకు కూడా దొరక్కూడదన్న పట్టుదలతో సినిమాలు తీసే దర్శకులున్నారు. మేకప్‌, డ్రెస్సింగ్‌, గాడ్జెట్స్‌, భాష, యాస, రూపం విషయంలో కంటిన్యుటీ పాటించడం వగైరా వగైరా చాలానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు సినిమాటిక్‌ లిబర్టీస్‌ తీసుకుని బ్లండర్‌ మిస్టేక్స్‌ చేస్తుంటారు కొందరు దర్శకులు. అలా బాలీవుడ్‌లో కొన్ని గొప్ప సినిమాల్లో అలాంటి బ్లండర్‌ మిస్టేక్స్‌ చేసిన సందర్భాలున్నాయి.

లగాన్‌ సినిమాలో క్రికెట్‌ మ్యాచ్‌ పెద్ద బ్లండర్‌. 1892లో క్రికెట్‌ ఆట రూల్స్‌ వేరు. అప్పుడు ఓవర్‌కి ఆరుబంతులు అన్న రూల్‌ లేదు. కానీ లగాన్‌లో 6బంతులు వేయించారు. అది సినిమాటిక్‌ లిబర్టీ. హేబేబి సినిమాలో ముగ్గురు హీరోలు అసలు ఆ బేబి ఎవరికి పుట్టింది? అని వెతుకుతారు. దానికోసమే 3గంటల సినిమా. డిఎన్‌ఎ టెస్ట్‌ చేస్తే 3 నిమిషాల పని. కానీ 3గంటలు వృధా ప్రయాస. సోలే మూవీలో థాకూర్‌ సొట్ట చెయ్యి అని చూపించారు. కానీ దానిని కవర్‌చేయలేక కొన్నిచోట్ల దొరికిపోయారు. చొక్కాలోకి దూర్చిన చెయ్యి పక్కాగా కనిపిస్తుంది.

భాగ్‌ మిల్కా భాగ్‌ చిత్రంలో 'నాన్‌ మున్నా రహీ హూ..' అంటూ సాగే పాట సన్నాఫ్‌ ఇండియా (1962)లోని పాట అది. అమీర్‌ నటించిన పీకేలో బ్రూజెస్‌లో పాకిస్తాన్‌ ఎంబసీ ఉందని చూపించారు. కానీ బ్రస్సెల్స్‌లో ఉంది. ధూమ్‌3లో కత్రిన పాదాల నుంచి తొడల వరకూ స్టాకింగ్స్‌ వేసుకుంటుంది. కానీ అవి మొదటి డ్రెస్‌లో కనిపించవు. వరుసగా వలువలు విప్పేసే క్రమంలో అవన్నీ బైటపడతాయి. వాటిని చిన్న ట్రిక్స్‌తో ప్లేచేస్తుంది క్యాట్‌. కానీ అవన్నీ పరిశీలనగా చూస్తే ఎలా విప్పుతుందో తెలిసిపోతుంది.

రా-వన్‌లో షారూక్‌ క్రిస్టియన్‌. అయినా అతడు చనిపోతే అస్థికల్ని గంగలో కలుపుతుంది బెబో. ఇదెంత పెద్ద బ్లండర్‌? ఇలాంటివెన్నో ఉత్తరాది సినిమాలో అలవోకగా దొర్లిపోయాయి. అయితే సినిమాటిక్‌ అని ఇలాంటివాటిని లైట్‌ తీస్కోవాల్సిందే.

Tags:    

Similar News