జాకీ బనియన్‌ వేశారేంటి గుణా?

Update: 2015-10-10 09:30 GMT
నిజానికి రుద్రమదేవి సినిమాలో మనం ఒప్పుకునే  విషయాలు కొన్నుంటే.. ఒప్పుకోని విషయాలు కొన్నున్నాయ్‌. అయితే చరిత్రను వక్రీకరించినా.. లేకపోతే గ్లామరైజ్‌ చేసినా మనం తట్టుకోగలం కాని.. మరీ దారుణంగా చరిత్రకు టామీ హిల్‌ ఫిగర్‌ టీ షర్టు వేస్తాం అంటే కుదరదు కదా.. సరిగ్గా గుణశేఖర్‌ అదే పని చేశాడు. దానితోనే చాలామంది డిస్‌ కనెక్టు అయిపోయారు.

సినిమా మొత్తం ఒకెత్తయితే.. అసలు నాగభైరవుడు క్యారెక్టర్‌ చేసిన బాబా సెహగల్‌ క్యారక్టర్‌ ఒకెత్తు. ఎందుకంటే.. మనోడు ఏదో గొప్పగా చేసి అందిరినీ మెప్పించేశాడని కాదు.. అసలు అతగాడి మీద షాట్‌ క్లోజ్‌ అప్‌ పెట్టగానే.. ముందుగా కనిపించేది ఆయన వేసుకున్న కట్‌ బనియన్‌. అదేదో జాకీ బ్రాండ్‌ యాడ్‌ చూస్తున్నట్లు.. రూప బనియన్‌ యాడ్‌ టివిలో వస్తున్నట్లుంది ఆ సీన్‌ చూస్తే. నాగభైరవుడు విలనీ ద్వారా భయం రాకపోగా.. ఆ బనియన్‌ లుక్‌ తో చాలామందికి నవ్వొచ్చేసింది. ఇన్ని జాగ్రత్తలూ తీసుకొని.. ఇన్నేసి కోట్లు పోసి.. చివరకు ఇలాంటి సిల్లీ మిస్టేకులే కాస్త ఎటకారంగా ఉంటాయ్‌ మరి. పాపం గుణశేఖరుడు ఇలాంటి వాటికి దొరికిపోయాడేంటో..

అయినాసరే సినిమాలో ఉన్న ఆర్టు వర్కు లోపాలతో పోలిస్తే అసలు ఈ బనియన్‌ మ్యాటర్‌ పెద్ద విశేషం కాకపోవచ్చు. కాని స్టిల్‌.. మరీ ధైర్యంగా అలా బనియన్‌ వేశేయడమేంటండీ.. ఆ కాలంలో అంతటి ఫైన్‌ ఫినిషిడ్‌.. ఫైన్‌ పాలిషుడ్‌ బనియన్లు మనం దేశంలో ఎక్కడివి? పోనివ్‌ ఆయనదేమైనా ఓ ఫారిన్‌ వ్యపారస్తుడి క్యారెక్టరా.. కాదాయే.. హిస్టరి సినిమాలంటే ఇలాంటి డిటెయిల్స్‌ బాగుండాలి బాసూ!!
Tags:    

Similar News