మహిళా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీమిండియా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ జీవిత గాధ వెండితెరకెక్కనుంది. సాధారణంగా పురుషులకు మాత్రమే పరిమితమైన క్రికెట్ లో ఓ మహిళగా మిథాలీ అనేక రికార్డులు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంది. అయినా కూడా ఎక్కడా అలుపెరుగకుండా తన పోరాటపటిమను చూపించి.. క్రికెట్ లోనే అనేక పతకాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ సక్సెస్ స్టోరీ త్వరలోనే సినిమాగా మన ముందుకు రాబోతోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మేరకు హక్కులు కొనుగోలు చేసి మిథాలీతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు ఓ కథనం వెలుగు చూసింది.
వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కిన మిథాలీ జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం. అందుకే చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాం అని వయాకమ్18 మోషన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. శక్తివంతమైన మహిళలపై సినిమాలు తెరకెక్కించేందుకు మేము ఎప్పుడూ ముందుంటాం. ఈ క్రమంలోనే కహానీ - మేరీ కోమ్ లాంటి కథలను తీశాం. ఇప్పుడు మిథాలీ కథను చూపించబోతున్నాం అని వయాకమ్18 సీవోవో అజిత్ అందారే చెబుతున్నారు.
మరోపక్క తన కథను సినిమాగా తెరకెక్కించబోతుండటంపై మిథాలీ సంతోషం వ్యక్తం చేస్తోంది. తన చిత్రం మరికొంత మంది యువతులకు ప్రేరణగా నిలిస్తే చాలని 34 ఏళ్ల స్టార్ బ్యాట్స్ ఉమెన్ అంటోంది. అయితే మిథాలీ పాత్రలో మెరిసే నటి ఎవరో.. తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామని వయాకమ్18 చెబుతోంది. ఇదిలా ఉంటే మహిళా క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బయోపిక్ కూడా ఛక్‌ధా పేరుతో సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. మొత్తానికి మహిళా క్రికెటర్ పై మూవీ రావడం దేశ చరిత్రలోనే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.