ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌డ వ‌ర‌కే ప‌రిమితం!

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావాలంటే ప‌రిచ‌యాలు కీల‌కం అంటారంతా. ద‌ర్శ‌క‌,నిర్మాత‌ల‌తో ఉన్న ర్యాపో కార‌ణం గానే ఎక్కువ‌గా ఛాన్సులొస్తాయ‌ని అంటారు

Update: 2025-01-08 13:30 GMT

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావాలంటే ప‌రిచ‌యాలు కీల‌కం అంటారంతా. ద‌ర్శ‌క‌,నిర్మాత‌ల‌తో ఉన్న ర్యాపో కార‌ణం గానే ఎక్కువ‌గా ఛాన్సులొస్తాయ‌ని అంటారు. ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది న‌టీన‌టులు కూడా ఈ వాద‌న‌ను సమర్శించిన సంద‌ర్భాలెన్నో. నెపోటిజం కూడా ఈ విధంగానే హైలైట్ అయింది. అయితే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ మాత్రం అందుకు భిన్న‌మైన సమాధాన చెబుతుంది.

సినిమా రంగంలో తెలిసిన వ్య‌క్తులు ఎంత మంది ఉన్నా? ఆ రిలేష‌న్ షిప్స్ కేవ‌లం వేరే వాళ్ల గురించి తెలుసు కోవ‌డానికి మాత్రమే ఉప‌యోగప‌డ‌తాయంది. ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌తిభావంతుల్ని క‌లిసే అవ‌కాశాల‌ను మాత్ర‌మే సుల భ‌త‌రం చేస్తాయంది. అంతేకానీ ప‌రిచ‌యంతోనే సినిమా అవ‌కాశం రాదంది. ఇండ‌స్ట్రీలో విజ‌యానికి ప‌రిచ‌యం మార్గం కాదంది. ఆ ప‌రిచ‌యంతో కేవ‌లం అవ‌కాశం స్వ‌త‌హాగా సృష్టించుకోవాల్సిందేన‌నిని పేర్కోంది.

ఎక్కువ మంది ద‌ర్శ‌కులు న‌టీన‌టుల మునుప‌టి చిత్రాల ఫ‌లితాలు ఆధారంగానే అవ‌కాశాలు క‌ల్పిస్తారు. కొంత మంది ద‌ర్శ‌కులు అగ్ర తార‌లు కంటే? కొత్త ముఖాల్ని తెర‌పై చూపించ‌డానికి ఆస‌క్తి చూపిస్తారంది. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాన‌ని, విమ‌ర్శ‌లు, తిరస్క‌ర‌ణ‌లు సైతం చూసానంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

కియారా `గేమ్ ఛేంజ‌ర్` తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 10న చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. దీనిలో భాగంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంది. ఇక కియార కెరీర్ బాలీవుడ్ లోనూ దేదీప్య మానంగా సాగిపోతుంది. అక్క‌డా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. హిందీలో `వార్ -2`లో, క‌న్న‌డ‌లో `టాక్సిక్` లోనూ న‌టిస్తుంది.

Tags:    

Similar News